ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NTR centenary celebrations: "ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమానికి టీడీపీ సన్నద్ధం" - NTR centenary celebrations in tadigadapa

NTR centenary celebrations: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలుగుదేశం సన్నద్ధం అవుతుంది. మే 28న జరగనున్న కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు తో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌, నందమూరి బాలకృష్ణ ఒకే వేదిక పై పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు.

NTR centenary celebrations
NTR centenary celebrations

By

Published : Apr 25, 2023, 1:43 PM IST

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సావనీర్ ఆవిష్కరణకు ఏర్పాట్లు

NTR centenary celebrations: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం సిద్ధం అవుతుంది. మే 28న పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు తమిళ సూపర్​ స్టార్ రజనీకాంత్​, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఒకే వేదికపై పాల్గొనే ఈ కార్యక్రమ ఏర్పాట్లను విజయవాడ సమీపంలోని తాడిగడప వద్ద చకచకా చేస్తున్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని ఈ వేదికపై ఆవిష్కరించనున్నారు.

కార్యక్రమం నిర్వహించే ప్రాంగణంలో కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్, తెలుగుదేశం నేతలు పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేశారు. ఎన్టీఆర్​కి ఎన్టీఆరే సాటి అని నేతలు పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారన్నారు. ఎనిమిది నెలలుగా కమిటీ వీటి మీద పని చేసిందని తెలిపారు. వేదికపై నాజర్ అబ్బాయి బాబ్జీతో ఎన్టీఆర్‌ చరిత్రపై బుర్ర కథ ఏర్పాటు చేశామన్నారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆరోజు ఉంటాయని తెలిపారు.

"అన్నగారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక సావనీర్​ తీసుకురావాలని, వారిని చరిత్రలో నిలిచిపోయే విధంగా నిలపాలనే ఉద్దేశంతో మా సావనీర్​ లిటరేచర్​ అండ్​ వెబ్​సైట్​ కమిటీ మిత్రులందరం కలిసి ఒక వెబ్​సైట్​ క్రియేట్​ చేయాలని అలాగే ఒక యాప్​ తయారు చేయాలని నిర్ణయించాం. అన్నగారి అసెంబ్లీ ప్రసంగాలకు ఒక పుస్తక రూపం తీసుకురావాలని ఎనిమిది నెలలుగా పని చేస్తున్నాం. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. మే 28న విజయవాడలో ఈ కార్యక్రమం జరుగుతోంది. అందరూ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి దీనిని విజయవంతం చేయాలని విజ్ఞప్తి"-జనార్ధన్​, ఎన్టీఆర్​ జయంతి ఉత్సవాల సావనీర్​ కమిటీ ఛైర్మన్​

ఎన్టీఆర్‌ చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాల పుస్తకం ఆవిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు వెంకట నారాయణ ఈ‌ పుస్తకా‌న్ని రాశారన్నారు. తెలుగు జాతి ముద్దు బిడ్డగా.. తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని నేతలు కొనియాడారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్‌ చరిత్రను అందరికీ అందుబాటులోకి తేవడం గొప్ప విషయమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ తరహాలో చంద్రబాబు ఆ పథకాలను కొనసాగించారని తెలిపారు.

నేడు ఏపీలో నిరంకుశత్వ పాలన సాగుతోందని నేతలు ధ్వజమెత్తారు. చరిత్రలో‌ గుర్తుండిపోయేలా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు చేస్తున్నామని కమిటీ సభ్యులు వెల్లడించారు. ప్రజలు కూడా ఎన్టీఆర్‌ ‌చరిత్ర గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారన్నారు. వంద సభలు నిర్వహించి, మే 28న శత జయంతిని గొప్పగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ శత జయంతి ‌వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details