Chandrababu at Nimmakuru : సంపద సృష్టించి, అది పేదలు అనుభవించేలా చేయటమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మన ఊరు పిల్లలు ప్రపంచానికి పని చేసి డబ్బులు సంపాదించే విధానం ఈ ప్రాజెక్ట్ లో ఓ భాగమని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనే అసలు సిసలైన రాజకీయంగా ఎన్టీఆర్ ప్రజా సేవ చేశారని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన కు తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ లక్ష్యాలను చంద్రబాబు ఆవిష్కరించారు.
రాష్ట్రం బాగుపడాలంటే సైకో జగన్ పోవాలి: చంద్రబాబు
నిమ్మకూరు గ్రామంలో ఎన్టీఆర్, బసవతారకం దంపతుల విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. నందమూరి వంశీకులు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబు నందమూరి బంధువుల ఇళ్లకు రావడంతో బంధువులు హర్షం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పేదరిక నిర్మూలన ప్రాజెక్టును ఆయన స్వగ్రామం నిమ్మకూరులో ప్రారంభిస్తున్నామన్నారు. మన గ్రామాలను ప్రపంచానికి అనుసంధానం చేసే వినూత్న కార్యక్రమమే ఈ పూర్ టు రిచ్ అని వెల్లడించారు.
యువతకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తమ ధ్యేయం: చంద్రబాబు
నిమ్మకూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించే పేదరిక నిర్మూలన కార్యక్రమం అందరికీ మార్గదర్శకం కానుందని తెలిపారు. సమాజం వల్ల బాగుపడిన వాళ్లు తమ ఊర్లో ఒక కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకునేలా కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో మన ఊర్లో పుట్టిన వారు మనతో సమానంగా పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రాజెక్టు పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇది ప్రారంభం మాత్రమే, ఆచరణలో విజయవంతం కావటానికి కాస్త సమయం పడుతుందన్నారు.
రాష్ట్రం బాగు కోసం యువత ముందుకు రావాలి: చంద్రబాబు
'ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది ప్రారంభం మాత్రమే. ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాలి. యువత శక్తి సామర్థ్యాలను పెంపొందించడం, ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ఆదాయ మార్గాల అన్వేషణ కొనసాగుతుంది. ఏ చదువు చదివితే బాగుంటుందో గైడ్ చేయడంతో పాటు ఆర్థిక సాయం అందించడం గురించి ఆలోచించారు. డబ్బులు సంపాదించడమే కాదు వాటిని ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. p4 ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని తీసుకురానున్నాం. ఇక్కడున్న గ్రామంలో 1800 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కానీ, గ్రామంలో వ్యవసాయం చేస్తున్నది 80 మంది మాత్రమే. గ్రామం నుంచి చాలా మంది వలస వెళ్లారు. గ్రామం నుంచి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. వారంతా గ్రామంలో కుటుంబాలను బాగు చేసే బాధ్యత తీసుకోవాలి. వారికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో సహకారం అందిస్తాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూత అందించడంతో పాటు, ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలను అన్వేషించాలి. - చంద్రబాబు, తెలుగుదేశం అధినేత
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీదే: చంద్రబాబు