ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణానదిలో ఈత పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలు, యువకులు - ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వివరాలు

swimming competitions in Krishna river: కృష్ణానదిలో ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈత పోటీలకు మంచి స్పందన లభించింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి స్విమ్మర్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా కార్యక్రమంలో పాల్గొన్నారు.

swimming competitions
ఈత పోటీలు

By

Published : Feb 26, 2023, 10:47 PM IST

Updated : Feb 27, 2023, 2:42 PM IST

Swimming competition in Krishna river at Vijayawada: ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణానది ఈత పోటీలకు మంచి స్పందన లభించింది. దుర్గా ఘాట్ నుంచి లోటస్ ఫుడ్ ప్లాజా వరకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరాన్ని క్రీడాకారులు స్విమ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి స్విమ్మర్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. సుమారు 460 మంది స్విమ్మర్స్ పోటీల్లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.

11 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సున్న వాళ్లు సైతం నదిని సునాయాసంగా ఈదారు. మంచినీటిలో ఈత కొట్టడం ఎంతో ఆనందంగా ఉందని క్రీడాకారులు చెబుతున్నారు. 51 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు చెప్పారు. స్విమ్మర్స్​కు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. గజ ఈతగాళ్లను, పడవలను అందుబాటులో ఉంచామన్నారు. 23 యేళ్ల నుంచి కృష్ణానది క్రాసింగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు కేటగిరీల్లో క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా కార్యక్రమంలో పాల్గొన్నారు .

విజేతలకు కాంతిరాణా టాటా చేతుల మీదుగా బహుమతుల ప్రదానం

'కృష్ణా నదిలో రివర్ క్రాసింగ్ ఈత పోటీలు పెట్టారు. అందరూ పాల్గొన్నారు. ఈత పోటీ కార్యక్రమానికి తెలంగాణ, కర్ణాటక.. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్​లో మెుత్తం 17వందల మంది వరకు సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టి అందరిలో ఉత్సాహన్ని నింపారు.'- వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే

'గజ ఈతగాళ్లను, పడవలను అందుబాటులో ఉంచాం. 23 యేళ్ల నుంచి కృష్ణానది క్రాసింగ్ పోటీలు నిర్వహిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. ఈ పోటీల్లో మొత్తం ఐదు కేటగిరీల్లో క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పిల్లలు, యువకులు, వృద్దులు, దివ్యాంగులు ఇలా అన్ని వయసుల వారు ఈ పోటీల్లో పాల్గొన్నారు.'- గోకరాజు గంగరాజు ,మాజీ ఎంపీ

ఇవీ చదవండి:

Last Updated : Feb 27, 2023, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details