Ramakrishna Nanda Swamiji Suspect Death in NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబర్పేట గ్రామంలో సద్గురు భోదానంద స్వామి ఆశ్రమంలో స్వామీజీ రామకృష్ణానంద స్వామి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్వామీజీ తల్లి భ్రమరాంబ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ నంద స్వామీజీకి గత ఆదివారం అనారోగ్యంగా ఉండటంతో నందిగామలోని వైద్యశాలకు తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ మృతిపై తల్లి అనుమానం వ్యక్తం చేశారు.
స్వామీజీ రామకృష్ణానంద స్వామి అనుమానాస్పద మృతి - సద్గురు భోదానంద స్వామి ఆశ్రమం
Swamiji Suspect Death In ntr District :ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో భోదానంద స్వామి ఆశ్రమంలో స్వామీజీ రామకృష్ణానంద స్వామి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మృతిపై తల్లి అనుమానం వ్యక్తం చేశారు.

అనుమానాస్పద
పూర్తి ఆరోగ్యంగా ఉన్న తమ కుమారుడు.. ఒకేసారి ఎలా మరణిస్తారని, దీనిపై విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమందిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు నందిగామ సీఐ సతీష్ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ మార్చురికి తరలించారు.
ఇవీ చదవండి