ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట - నేటి తాజా వార్తలు

Ex Minister Narayana : మాజీ మంత్రి నారాయణకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Ex Minister Narayana
మాజీ మంత్రి నారాయణ

By

Published : Jan 6, 2023, 2:49 PM IST

Ex Minister Narayana : పేపర్‌ లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గతంలో బెయిల్​ రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గత సంవత్సరంలో ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్‌లో పదోతరగతి ప్రశ్నపత్రం లీకైంది. వాట్సాప్‌ ద్వారా తెలుగు ప్రశ్నపత్రం బయటకు రావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో నారాయణ పాత్ర ఉన్నట్లు చిత్తూరు పోలీసులు వెల్లడించారు.

నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014లోనే నారాయణ వైదొలిగారంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై గతంలో కొన్ని నెలలుగా జిల్లా కోర్టు, హైకోర్టుల్లోనూ విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన హైకోర్టు నారాయణ బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details