STUDENTS PROTEST : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్మహమ్మద్ పేట సమీపంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్వాసన వల్ల స్థానికంగా ఉన్న విద్యార్థులు గత కొన్ని నెలలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై పలుమార్లు వారి తల్లిదండ్రులు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ప్రశ్నించిన స్పందన కరువైంది. విషపూరిత రసాయన వాయువులను బయటికి వదులుతున్నారని గ్రామస్థులు పలుమార్లు కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన నిర్వహించారు. అయినా అటు ఫ్యాక్టరీ యజమాన్యం, కాలుష్య నియంత్రణ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. తాజాగా ఈరోజు ఐదుగురు విద్యార్థులకు వాంతులు అయ్యాయి. రసాయన ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైస్కూల్ విద్యార్థులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు.
షేర్‌మహమ్మద్‌పేటలో రసాయన పరిశ్రమ వద్ద విద్యార్థుల ఆందోళన - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
STUDENTS PROTEST AT CHEMICAL FACTORY : పరిశ్రమ నుంచి వచ్చే విషవాయువులు పీల్చి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తోటి విద్యార్థులు పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా షేర్మహమ్మద్ పేటలో నిరసనలు చేపట్టారు.
students protest at chemical industry
Last Updated : Nov 22, 2022, 1:55 PM IST
TAGGED:
STUDENTS PROTEST