Students Future Does Not Care Jagan Government : సీఎం జగన్ కోపమంతా చంద్రబాబుపైనే.. ఆయనపై కక్ష తీర్చుకునేందుకు ప్రజావేదికతో మొదలు పెట్టి.. రాజధాని అమరావతినీ ధ్వంసం చేశారు. రైతులకు బతుకునిచ్చే పోలవరం ప్రాజెక్టును భ్రష్టుపట్టించేందుకూ వెనకాడలేదు. అయినా కసితీరక నైపుణ్య కుంభకోణం పేరుతో చంద్రబాబును అరెస్టు (Chandrababu Naidu Arrest in Skill Development Scam) చేశారు. అయితే అందుకు నాశనం చేసిందేంటో తెలుసా? పిల్లలను నిపుణులుగా తీర్చిదిద్దే శిక్షణ కేంద్రాలనే..! బలి చేసింది దేన్నో తెలుసా? మన పిల్లల బంగారు భవిష్యత్తునే.
Jagan Government Allegations on Siemens and Designtech Companies :ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్ స్థాయిలోనే మన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి.. చదువు పూర్తయ్యే నాటికే వారిని ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆయనపై పగ తీర్చుకునేందుకు ఈ నైపుణ్య శిక్షణ కేంద్రాలనే జగన్ చంపేస్తున్నారు (Jagan is Killing Skill Training Centers) . రాష్ట్రంలో శిక్షణ ఇస్తున్న సీమెన్స్, డిజైన్‌టెక్ వంటి సంస్థలపై బురద జల్లుతున్నారు. ఇలా చేస్తే మరే సంస్థ అయినా రాష్ట్రానికి వస్తుందా అని కూడా ఆలోచించడం లేదు.
రాష్ట్రం నాశనమైతే నాకేంటి? అరాచకమే నా ఎజెండా అనేలా హిట్లర్, నీరో లాంటి నిరంకుశ పాలకులకే పెద్దన్నగా తయారయ్యారు. 73 ఏళ్ల చంద్రబాబుపై పగ సాధించేందుకు ఒక తరం యువత భవితను జగన్ నాశనం చేశారు. ఈ రోజు కాకుంటే రేపైనా చంద్రబాబు న్యాయ పోరాటం ద్వారా అక్రమ కేసుల నుంచి బయటపడొచ్చు. మన పిల్లలు మాత్రం కోల్పోయిన భవితను తిరిగి అందుకోలేరు. మనం మేలుకునేలోపు వారి తలరాతలే మారిపోతాయి. అప్పుడూ, ఇప్పుడూ సీఎం జగన్, ఆయన మంత్రులు, అనుయాయుల పిల్లల భవిష్యత్తుకు వచ్చిన నష్టం, కష్టమేమీ ఉండదు. ఓడిపోయేది ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా చదువుకునే రేపటి తరం పేద యువత, వారి కలలే..! గెలిచేది పేదల పిల్లలకు పెద్దపెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాలు ఎందుకనే కుటిల రాజకీయనేతలే!
Labs in Government Colleges and Universities Lack Basic Facilities : ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ల్యాబ్‌లలో మౌలిక సౌకర్యాలు లేవు. బోధకుల కొరత వెన్నాడుతోంది. ఇక్కడ చదువు పూర్తి చేసిన వారికి.. వెంటనే ఉద్యోగాలు లభించే అవకాశాలు తక్కువ. చదువు పూర్తి చేసే వారిలో ప్రతిభావంతులైన 10 శాతం మందినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. మిగిలిన వారికి నైపుణ్యం అవసరమని చెబుతున్నాయి. కంపెనీలు కోరుతున్నట్లుగా.. వీరందరినీ ఉద్యోగ అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దేందుకే నైపుణ్యాభివృద్ధి సంస్థను చంద్రబాబు ఏర్పాటుచేశారు.
ప్రతిష్ఠాత్మక సంస్థ సీమెన్స్‌తో ఒప్పందం చేసుకుని 6 ఎక్స్‌లెన్స్ కేంద్రాలు, 36 నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆయా కేంద్రాల్లోనే 2.13 లక్షల మందికి శిక్షణ ఇప్పించారు. 72 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దేశంలో మరెన్నో రాష్ట్రాలు నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని గుర్తించి, సీమెన్స్‌తో ఒప్పందం చేసుకున్నాయి. కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు నేరుగా సీమెన్స్‌తో కలిసి పని చేస్తున్నాయి.
మన యువత నిపుణులు కావాలని, పేరున్న సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకోవాలని పెద్ద ప్యాకేజీలతో జీతాలు పొందాలని చంద్రబాబు ఆలోచించారు. జగన్ మాత్రం చంద్రబాబుపై పగ సాధించడమే లక్ష్యంగా నడిచారు. ఆయన తెచ్చిన నైపుణ్య శిక్షణ కేంద్రాలను చంపేసేలా పనిచేస్తున్నారు. చంద్రబాబును కేసులో ఇరికించాలనే దురాలోచనతో మన పిల్లల భవిష్యత్తునూ దెబ్బతీసేందుకు సిద్ధమయ్యారు.