Students Demanded to Release Mega DSC Notification: ఉపాధ్యాయుల పోస్టుల గురించి మాట్లాడని సీఎం ఎవరైనా ఉన్నారంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డీఎస్సీ విద్యార్థులు మండిపడ్డారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో వందల మంది డీఎస్సీ అభ్యర్థులు ఈరోజు రోడ్డెక్కారు. 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రజలను పాలించడానికి వచ్చారా లేకపోతే ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి వచ్చారా అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
DSC Candidates Protest in Avanigadda: పాదయాత్రలో డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన మాట నెరవేర్చుకుని 23వేల పోస్టులతో మెగా డీఎస్సీని తక్షణమే విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లలో డీఎస్సీ విడుదల చేయకపోవటం సిగ్గుచేటు, ఆవిరైపోతున్న ఉపాధ్యాయ నిరుద్యోగ ఆశలు, సున్నాలలో నోటిఫికేషన్ వద్దు మెగా డీఎస్సీ ముద్దు అంటూ విద్యార్థులు ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో రెండుసార్లు నోటిఫికేషన్ ఇస్తే జగన్ ఒక్కసారి కూడా విడుదల చేయకపోవటం సిగ్గు చేటు అని విద్యార్థులు ఎద్దెవ చేశారు.
"నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులకు పాల్పడుతుంది. తక్షణమే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి లేకపోతే నిరుద్యోగుల సత్తా ఎమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం" -విద్యార్థులు
మెగా డీఎస్సీ పేరుతో సీఎం జగన్ బడా మోసం - భగ్గుమన్న నిరుద్యోగులు, కలెక్టరేట్ ఎదుట ఆందోళన