Student Unions Protest : విజయవాడ ధర్నాచౌక్ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో.. డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీలో.. ఐదేళ్ల వయోపరిమితి పెంచాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్‌ను జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మార్చారంటూ.. విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి విద్యార్థి, యువజన సంఘాలు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకుని.. అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా పోరాటం చేస్తుంటే అరెస్టులకు పాల్పడుతున్నారంటూ యువజన సంఘాలనేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
డీజీపీ కార్యాలయం ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం.. అరెస్టు చేసిన పోలీసులు - విజయవాడ ధర్నా చౌక్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన
Student Unions Protest At Dharna Chowk : పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని ఐదేళ్లు పెంచాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్‌ను జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మార్చారంటూ మండిపడ్డారు.
Student Unions Protest At Dharna Chowk