ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించం - స్పష్టం చేసిన మున్సిపల్‌ కార్మికులు - మున్సిపల్‌ కార్మికులు

Statewide Muncipal Workers Protest in Andhra Pradesh: పురపాలక కార్మికులు మూడోరోజూ నిరసవధిక సమ్మె కొనసాగించారు. రోజూరోజుకూ ఆందోళన ఉద్ధృతి పెంచుతున్న కార్మికులు చెవిలో పూలు, చేతిలో చిప్పలతో వినూత్నంగా నిరసన తెలిపారు. నగరపాలక, పురపాలక కార్యాలయాల ఎదుట ధర్నాకు దిగారు. కార్మికుల ఆందోళనతో చెత్తా చెదారం పేరుకుపోయింది. ప్రభుత్వం ఆర్టీసీ డ్రైవర్లతో చెత్త వాహనాలు నడిపేందుకు యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు.

Etv Bharatstatewide_muncipal_workers_protest_in_andhra_pradesh
Etv Bharatstatewide_muncipal_workers_protest_in_andhra_pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 8:22 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల నిరసనలు

Statewide Muncipal Workers Protest in Andhra Pradesh :సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు మూడో రోజు నిరసనలతో హోరెత్తించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. సీఎం జగన్‌ అబద్దపు హామీలతో తమకు అన్యాయం చేశారని నంద్యాలలో చెవిలో కాలిఫ్లవర్‌ పెట్టుకుని వినూత్నంగా వనిరసన తెలిపారు.

చెవిలో పూలు, చేతిలో మట్టి గిన్నెలు - మూడో రోజు పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

Muncipal Workers Protest In Satyasai District :శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో పురపాలక, పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మద్దతు తెలిపారు. కార్మికుల సమ్మెకు 50 వేలు విరాళం అందించారు. చాలీ చాలని జీతాలతో అవస్థలు పడుతున్నామని, జీతాలు పెంచి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చెవులో పువ్వులు పెట్టుకొని నిరసనకు దిగారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని తేల్చి చెప్పారు.

Muncipal Workers Protest In Vijayawada District : వేతనాలు పెంపు సహా ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరించాలంటూ పురపాలక పారిశుద్ద్య కార్మికులు చేపట్టిన సమ్మె ఉద్దృతంగా కొనసాగుతోంది. విజయవాడ ధర్నాచౌక్‌లో పెద్దఎత్తున కార్మికులు నిరసన తెలిపారు. ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం జగన్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. ఎన్టీఆర్​ జిల్లా నందిగామ పురపాలక కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. చెవిలో పూలు, చేతిలో చిప్పలు పట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. గుంటూరు నగరపాలకసంస్థ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. మంగళగిరిలోనూ చెవిలో పూలతో కార్మికులు నిరసన తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల పురపాలక కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని తేల్చి చెప్పారు.

ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఉద్ధృతం - రెండో రోజు మున్సిపల్ కార్మికులు పోరు బాట

Muncipal Workers Protest In Ubaya Godavari : ఉభయ గోదావరి జిల్లాల్లోనూ మున్సిపల్ కార్మికుల ఆందోళనలు మిన్నంటాయి. తణుకులో మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలపారు. కాకినాడ జిల్లా తునిలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ముమ్మిడివరంలో చెవిలో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. కార్మికులకు వామపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు.

3rd Day Muncipal Workers Protest : శ్రీకాకుళంలో ఆర్టీసీ డ్రైవర్లతో పారిశుద్ధ్య వాహనాలు బయటకు తీసేందుకు యత్నించగాకార్మికులు అడ్డుకున్నారు. అనంతరం నగరపాలక కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చుని వినూత్నంగా నిరసన చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట సమ్మె నిర్వహించారు. నంద్యాలలో పురపాలక కార్యాలయం ఎదుట నిరసన దీక్ష కొనసాగించారు.

మున్సిపల్​ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె సైరన్ - ప్రభుత్వానికి హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details