ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిట్‌ఫండ్ చట్టంపై ప్రజలు, అధికారులకు అవగాహన కల్పిస్తున్నాం: ఐజీ రామకృష్ణ

Stamps Department IG Ramakrishna: చిట్‌ ఫండ్ సంస్థల్లో సోదాలు, లెక్కల్లో అవకతవకలు ఎలా గుర్తించాలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవన్యూ ఇంటెలిజెన్స్‌(DRI) ద్వారా.. అవగాహన కల్పించామని.. రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ తెలిపారు.

Stamps Department IG Ramakrishna
Stamps Department IG Ramakrishna

By

Published : Dec 10, 2022, 11:04 AM IST

Registrations and Stamps Department IG: చిట్‌ ఫండ్ సంస్థల్లో సోదాలు ఎలా నిర్వహించాలో.. చట్టాల ఉల్లంఘనలు, లెక్కల్లో అవకతవకలను ఎలా గుర్తించాలో, పత్రాల పరిశీలన ఎలా చేయాలనే అంశంపై.. డిప్యూటీ, సహాయ రిజిస్ట్రేషన్‌ అధికారులకు.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవన్యూ ఇంటెలిజెన్స్‌(DRI) ద్వారా.. అవగాహన కల్పించామని.. రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ తెలిపారు. చిట్ ఫండ్‌ సంస్థల ఆడిటింగ్‌లో సహాయపడేందుకు విషయ నైపుణ్యం ఉన్న ఆడిటర్లు, ప్రత్యేకించి ఫోరెన్సిక్‌ వ్యవస్థలో నిపుణులను సలహాదారులు, కన్సల్టెంట్లుగా తీసుకోనున్నట్లు వెల్లడించారు.

చిట్‌ఫండ్ చట్టంపై ప్రజలు, అధికారులకు అవగాహన కల్పించే దశలో ఉన్నామన్నారు. విజయవాడ సమీపంలోని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్రంలోని 35 మంది డిప్యూటీ, సహాయ రిజిస్ట్రార్లకు విషయ నిపుణులు, న్యాయవాదులు, ఆడిటర్లు, డీఆఐ అధికారులతో సదస్సు నిర్వహించారు. చిట్‌ ఫండ్‌ సంస్థల బ్యాలెన్స్‌ షీట్‌, ఆస్తులు, అప్పులు, రశీదులు, పెట్టుబడుల్ని ఎలా నిశిత పరిశీలన చేయాలనే అంశాలను వివరించామన్నారు. రాష్ట్రంలో మూడు విడతలుగా 35 చిట్ ఫండ్‌ యూనిట్లను తనిఖీ చేశామన్నారు. త్వరలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేంద్ర కార్యాలయానికి వెళ్లి.. సమాచారం తీసుకుంటామని.. ప్రత్యేక బృందాలతో ఆడిట్‌ చేయించి.. సంస్థ ఆర్థికస్థితిని తెలుసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత షోకాజ్ నోటీసు ఇచ్చే ప్రయత్నం చేస్తామని.. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ తెలిపారు.

చిట్‌ఫండ్ చట్టంపై ప్రజలు, అధికారులకు అవగాహన కల్పించే దశలో ఉన్నాం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details