ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖాళీ పోస్టులను భర్తీ చేయండి మహా ప్రభో..! ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం: వీఆర్వో సంఘం - ఆంధ్ర ప్రదేశ్ వార్తలు

VROs Problems: కష్టపడి పని చేస్తున్నా తగిన గుర్తింపు రావట్లేదని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులను భర్తీ చేస్తే పని ఒత్తిడి తగ్గుతుందని వీఆర్వో సంఘం రాష్ట్ర నాయకులు అన్నారు. విజయవాడలో జరిగిన అత్యవసర సమావేశంలో రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొని సమస్యలపై చర్చించారు.

VROs association
వీఆర్వో సంఘం ప్రతినిధుల సమావేశం

By

Published : Dec 18, 2022, 10:45 PM IST

VROs Problems: రాష్ట్రంలో వీఆర్వోలు ప్రస్తుతం తీవ్రమైన పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారని వీఆర్వో సంఘం రాష్ట్ర నాయకులు ఆందోళన చెందారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో.. వీఆర్వోలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో అత్యవర సమావేశం నిర్వహించిన రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రతినిధులు.. సమస్యలపై చర్చించారు. కష్టపడి పని చేస్తున్నా వీఆర్వోలకు మెమోలు పంపి ఇబ్బందులు పెట్టడం బాధాకరమన్నారు. కనీస సౌకర్యాలు లేక వీఆర్వోలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఖాళీలను భర్తీ చేయడం వల్ల వీఆర్వోలపై పని ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. ప్రభుత్వ పెద్దలను కలిసి తమ విన్నపాలు వినిపిస్తామని వెల్లడించారు. వీఆర్వోలకు సీనియర్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు.

విజయవాడలో జరిగిన రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రతినిధుల సమావేశం

ABOUT THE AUTHOR

...view details