BC Corporation Director R Rajini: నకిలీ నోట్ల చలామణి వ్యవహారంలో అరెస్టు అయిన వైసీపీ నేత బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్ రజినిని పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీనోట్ల వ్యవహారంలో ఆమెను కర్ణాటక పోలీసులు అరెస్టు చేయటంతో బొందిలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా అమెను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నేత ఆర్ రజినిని 2020 అక్టోబరులో బొందిలి కుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి నుంచి రజిని తొలగింపు - Rajni circulates fake notes
BC Corporation Director R Rajini: నకిలీ నోట్ల చలామణి వ్యవహారంలో అరెస్టు అయిన వైసీపీ నేత బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రజినిని పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రజినిని 2020 అక్టోబరులో బొందిలి కుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన ప్రభుత్వం.. దొంగనోట్ల చలామణి, ముద్రణ వ్యవహారాల్లో కర్ణాటకలోని సుబ్రమణ్యపుర పోలీసులు అరెస్టు చేయడంతో.. పదవికి అనర్హురాలిగా పేర్కొంటూ తక్షణం అమెను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
BC Corporation Director R Rajini
ప్రస్తుతం దొంగనోట్ల చలామణి, ముద్రణ వ్యవహారాల్లో కర్ణాటకలోని సుబ్రమణ్యపుర పోలీసులు అరెస్టు చేసారు. అమెపై ఐపీసీ సెక్షన్లు 489ఏ, బీ, సీ కింద అభియోగాలు నమోదు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ప్రభుత్వంలోని బీసీ బొందిలి కార్పొరేషన్ అధికారిక డైరెక్టర్ పదవికి అనర్హురాలిగా పేర్కొంటూ తక్షణం అమెను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి జి జయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి: