ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాగితాలకే పరిమితమైన స్పోర్ట్స్ క్లబ్‌లు- సరికొత్త విన్యాసానికి తెరలేపిన వైసీపీ సర్కార్ - ఏపీ లేటెస్ట్ న్యూస్

Sports Clubs in AP: రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో క్రీడల్ని ప్రోత్సహించేందుకంటూ ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ క్లబ్​లు కాగితాలకే పరిమితమయ్యాయి. అయితే ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో 'ఆడుదాం ఆంధ్రా' అంటూ.. మరో విన్యాసానికి వైసీపీ సర్కారు తెరలేపింది.

Sports_Clubs_in_AP
Sports_Clubs_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 4:42 PM IST

Sports Clubs in AP: క్రీడల్ని ప్రోత్సహిస్తామంటూ ఘనంగా ప్రకటించిన స్పోర్ట్స్ క్లబ్‌లు.. కాగితాలకే పరిమితమయ్యాయి. సొంత డబ్బా కొట్టుకునేలా జగనన్న స్పోర్ట్ క్లబ్‌లు, వైఎస్ఆర్ కేవీకేలు అంటూ పేర్లు పెట్టుకున్నా.. వాటికి నిధులు మాత్రం విదల్చడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ సమయంలో 'ఆడుదాం ఆంధ్రా' అంటూ.. వైసీపీ ప్రచారం కోసం ప్రభుత్వ సొమ్ములను వెచ్చించేందుకు సిద్ధమైపోయింది.

కాగితాలకే పరిమితమైన స్పోర్ట్స్ క్లబ్‌లు- సరికొత్త విన్యాసానికి తెరలేపిన వైసీపీ సర్కార్

Adudam Andhra Tournament Guidlines: గ్రామస్థాయి నుంచి క్రీడల్ని, క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన స్పోర్ట్స్క్లబ్‌లు(Sports Clubs).. రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. గ్రామ, వార్డు పరిధిలో స్పోర్ట్స్ క్లబ్‌లు ఏర్పాటుచేస్తున్నట్లు గతేడాది జీవోలు జారీ చేసిన ప్రభుత్వం.. సచివాలయాల్లోని ఒక ఉద్యోగికి బాధ్యతలు కూడా కేటాయించింది. ప్రతి నెలా క్రీడా పోటీలు నిర్వహిస్తామని ఊదరగొట్టింది. స్కూళ్లు, కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలకు కోఆర్డినేటర్ల బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పింది.

కడపలో ఉత్కంఠభరితంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019

YCP Govt Not Provide Facilities For Sports Clubs: గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో స్పోర్ట్స్‌ క్లబ్‌ల పర్యవేక్షణకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అంతేకాదు.. మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల నిధుల నుంచి 4 శాతం క్రీడలపై ఖర్చు చేయాలని నిర్దేశాలు ఇచ్చేసింది. కానీ వసతుల కల్పన, క్రీడా పరికరాలకు అవసరమైన నిధులు కేటాయించడం మాత్రం మరిచిపోయింది. స్పోర్ట్స్ క్లబ్‌ల సంగతి అలా అటకెక్కగా.. క్రీడా వికాస కేంద్రాల పేరిట మరో విన్యాసానికి వైసీపీ సర్కారు తెర లేపింది.

Mega Sports Tournament in AP: ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో 8.62 కోట్ల రూపాయల ఖర్చుతో సమీకృత స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించింది. ఇతర నియోజకవర్గాల్లోనూ క్రీడా వికాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, పరికరాల కోసం 2 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తామని గొప్పలు చెప్పింది. ఆ తర్వాత నిధుల సంగతి మర్చిపోయినా.. పేర్లు మార్చే కోరిక మాత్రం తీర్చేసుకుంది. వైసీపీ క్రీడా వికాస కేంద్రాలుగా పేర్లు పెట్టేసుకుని.. అక్కడితో సరిపెట్టుకుంది.

No facilities in the grounds: 'ఆటల్లేవ్.. ఆడుకోవడాల్లేవ్.. అయినా ఐపీఎల్ కల'

CM Jagan Govt on Adudam Andhra Sports Event: స్పోర్ట్స్‌ క్లబ్‌లు, క్రీడా వికాస కేంద్రాలను ఆ విధంగా ఉద్దరించేసిన వైసీపీ సర్కారు.. ఎన్నికల ముందు స్వప్రయోజనాల కోసం 'ఆడుదాం ఆంధ్రా'(Adudam Andhra) అంటూ కొత్త కార్యక్రమాన్ని బయటికి తెచ్చింది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీల పేరిట.. సీఎం జగన్ స్టిక్కర్‌(CM Jagan sticker)తో ప్రచారం వెలగబెడుతోంది. ప్రభుత్వ ఖర్చుతో స్పోర్ట్స్ కిట్లు పంచిపెడుతూ.. వైసీపీ రాజకీయ ప్రచారం చేసుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details