Sankranti Special Trains : రాబోయే సంక్రాంతి పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 16ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాలలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జనవరి 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నడపనున్న.. ఈ రైళ్లు హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, విశాఖపట్టణం, తిరుపతి తదితర ప్రాంతాలకు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. డిసెంబరు 31 ఉదయం 8 గంటల నుంచి ముందస్తు టికెట్ల రిజర్వేషన్‌కు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. పూర్తి సమాచారాన్ని ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు - ఏపీ న్యూస్
Sankranti Special Trains : సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. తెలుగు రాష్ట్రాలలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇందులో భాగంగా 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు