Vijayawada Railway Station Massage Center : విజయవాడ రైల్వే స్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సేవలను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులు రైళ్ల కోసం వేచి ఉండే సమయంలో ఉపయోగించుకునేందుకు వీలుంటుందని ఈ సేవలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు, సౌకర్యవంతమైన అనుభూతిని అందిచటం కోసం సేవలను ప్రారంభించినట్లు వెల్లడించారు. అధికారులు ఏర్పాటు చేసిన రోబోటిక్ మసాజ్ సేవలలో రెండు రోబోటిక్ మసాజ్ కుర్చీలు, ఒక ఫుట్ మసాజ్ కుర్చీ ఉన్నాయి. ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫామ్‌పై 84 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మసాజ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
రోబోటిక్ మసాజ్: ఫుల్ బాడీకి 60 రూపాయలే.. ఎక్కడంటే! - విజయవాడ రైల్వే స్టేషన్
Massage Center : విజయవాడ రైల్వే స్టేషన్‌లో మసాజ్ సేవలను రైల్వే శాఖ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం, టికెట్ ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు.. ఈ సేవలను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
మసాజ్
మసాజ్ కుర్చీ ద్వారా బాడీ మసాజ్, ఫుట్ మసాజ్ కుర్చీ ద్వారా పాదాలకు మసాజ్ లాంటి సేవలందించనున్నట్లు అధికారులు తెలిపారు. బాడీ మసాజ్‌కు 60 రూపాయలు, ఫుట్ మసాజ్‌కు 30 రూపాయలు చెల్లించి మసాజ్ సేవలను పొందవచ్చని అధికారులు తెలిపారు. ఇటీవలే స్టేషన్‌లో ఫిష్ స్పా, హ్యాండ్‌లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్, మొబైల్ యాక్ససరీలకు సంబంధించిన అవుట్‌లెట్లను ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: