Somireddy Chandramohan Reddy: బకాసురిడికి తినేకొద్ది ఆకలి పెరిగినట్లు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతి పెరుగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటి వరకూ 2లక్షల కోట్ల రూపాయలను.. వివిధ మార్గాల్లో దోచారని ఆయన ఆరోపించారు. క్విడ్ ప్రోకో పదాన్ని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. వివక్ష లేకుండా సొంత పార్టీ ఎంపీ మాగుంట వ్యాపారాల నుంచి సైతం ముడుపులు దండుకుంటున్నారని సోమిరెడ్డి విమర్శించారు.
Somireddy Reddy: జగన్ పాలనలో అవినీతి పెరుగుతోంది: సోమిరెడ్డి - తెదేపా సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
Somireddy Reddy on Jagan: బకాసురిడికి తినేకొద్ది ఆకలి పెరిగినట్లు జగన్మోహన్రెడ్డి పరిపాలనలో అవినీతి పెరుగుతోందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. జగన్‌రెడ్డికి ఉన్న 3.55లక్షల చదరపు అడుగుల భవనాలు నిజాం నవాబుకు కూడా లేవని సోమిరెడ్డి ఎద్దేవాచేశారు.

Somireddy Reddy
జగన్ రెడ్డికి ఉన్న 3.55లక్షల చదరపు అడుగుల భవనాలు నిజాం నవాబుకు కూడా లేవని సోమిరెడ్డి ఆరోపించారు. తమ తాతల ఆస్తులపైనా రీ సర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని తిరిగి తనకు ఇస్తాడంటా అని మాజీమంత్రి ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటిడ్ కంపెనీగా మారిపోయిందని దుయ్యబట్టారు. విభజన తర్వాత చంద్రబాబు బాధ్యతతో రాష్ట్రాన్ని పునర్ నిర్మించినట్లే, జగన్ విధ్వంస పాలన అనంతరం పునర్ నిర్మించాల్సిన పరిస్థితి వచ్చిందని తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి: