Social Activist Gundala Malleswari: వైసీపీకి ఓటు వేసినందుకు బాధపడుతున్నానని బెజవాడకు చెందిన సామాజిక కార్యకర్త గుండాల మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. దాచేపల్లిలో సావిత్రిబాయి పూలే 192వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. మళ్లీ వైసీపీ ప్రభుత్వం రాకూడదని కోరుకుంటున్నానన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి వెయ్యి ఓట్లు వేయిస్తానని చెప్పారు.
జగన్‌కు ఓటు వేసి తప్పు చేశా : సామాజిక కార్యకర్త మల్లేశ్వరి - వైసీపీ ప్రభుత్వంపై కార్యకర్త మల్లేశ్వరి కామెంట్స్
Social Activist Gundala Malleswari: జగన్‌కి ఓటు వేసినందుకు బాధపడుతున్నాని ఓ సామాజిక కార్యకర్త ఆందోళన వ్యక్తం చేసింది. వైసీపీని గెలిపించాలనే ఉద్దేశ్యంతో.. పార్టీ తరుపున కష్టపడిన తమకు.. వాలంటీర్లు అధిపతుల్లాగా వ్యవహరించడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.. జగన్ ప్రభుత్వం కిందిస్థాయి నాయకులను పట్టించుకోలేదని దుయ్యబట్టింది..
![జగన్‌కు ఓటు వేసి తప్పు చేశా : సామాజిక కార్యకర్త మల్లేశ్వరి గుండాల మల్లేశ్వరి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17392940-469-17392940-1672817261030.jpg)
గుండాల మల్లేశ్వరి
వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా నడుపుతున్నారని ఆక్షేపించారు. ఈ విషయంపై ఆ పార్టీలో ప్రతి ఒక్కరూ ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. తమ పరిస్థితే ఇలా ఉంటే ఇంక సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఉహించుకోవాలన్నారు.
జగన్‌కు ఓటు వేసి తప్పు చేశా : సామాజిక కార్యకర్త గుండాలమల్లేశ్వరి
ఇవీ చదవండి:
Last Updated : Jan 4, 2023, 1:18 PM IST