ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. భాస్కర్ రిమాండ్‌ను తిరస్కరించిన సీఐడీ కోర్టు

skill development case latest updates: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో అవతవకలు జరిగాయన్న సీఐడి కేసుకు సంబంధించి.. ఈరోజు విజయవాడ సీఐడి కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాస్కర్ రిమాండ్‌ను తిరస్కరిస్తూ.. సీఐడి అధికారులు భాస్కర్‌ను విచారించాలని అనుకుంటే 41ఏ సీఆర్పీసీ ప్రకారం విచారణ చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. సీమెన్స్ కంపెనీలో పని చేస్తున్న సత్య భాస్కర్ ప్రసాద్ లబ్ధిదారుడు కాదని.. సీఐడి అధికారులు అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని.. భాస్కర్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

Court
Court

By

Published : Mar 9, 2023, 11:05 PM IST

Updated : Mar 10, 2023, 3:34 PM IST

skill development case latest updates: స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి.. విజయవాడ సీఐడి కోర్టు నేడు కీలక ఆదేశాలను జారీ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాస్కర్ రిమాండ్‌ను తిరస్కరిస్తూ.. భాస్కర్‌ను సీఐడి అధికారులు విచారించాలని అనుకుంటే 41ఏ సీఆర్పీసీ ప్రకారం విచారణ చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. సీమెన్స్ కంపెనీలో పని చేస్తున్న సత్య భాస్కర్ ప్రసాద్ లబ్ధిదారుడు కాదని.. సీఐడి అధికారులు అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని.. భాస్కర్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

వివరాల్లోకి వెళ్తే.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి ఈరోజు విజయవాడలోని సీఐడి కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో సీమెన్స్ కంపెనీలో పని చేస్తున్న సత్య భాస్కర్ ప్రసాద్ లబ్ధిదారుడు కాదని..అతన్ని అన్యాయంగా సీఐడి అధికారులు అరెస్ట్ చేసి, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని భాస్కర్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే పలుసార్లు భాస్కర్‌ను సీఐడి విచారించిందని.. ఆయన విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని న్యాయస్థానానికి తెలిపారు. ఈ తరుణంలో భాస్కర్‌ను హఠాత్తుగా అరెస్ట్ చేయటం వెనుక రాజకీయ కారణాలున్నాయని భాస్కర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

వాదనలు విన్న న్యాయస్థానం.. భాస్కర్ రిమాండ్‌ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో అవతవకలు జరిగాయని.. సీఐడి అధికారులు అతనిపై కేసు నమోదు చేసింది. దీంట్లో భాగంగా భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్ చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ కోర్టు తీసుకొచ్చారు. అనంతరం విజయవాడ సీఐడి కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో వాదోపవాదలు విన్న న్యాయస్థానం.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి భాస్కర్ రిమాండ్‌ను తిరస్కరిస్తూ... భాస్కర్‌ను సీఐడి అధికారులు విచారించాలని అనుకుంటే 41ఏ సీఆర్పీసీ ప్రకారం చేయవచ్చని కోర్టు ఆదేశించింది. సీమెన్స్ కంపెనీలో పనిచేస్తున్న సత్య భాస్కర్ ప్రసాద్ లబ్ధిదారుడు కాదని ..అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సీఐడి అధికారులు ఆయనపై నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని న్యాయవాది తేల్పి చెప్పారు.

తాజాగా భాస్కర్‌ను సీఐడీ అధికారులు నోయిడాలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకురావడంతో చర్చనీయాంశంగా మారింది. ట్రాన్సిట్ వారెంట్‌పై అతన్ని విజయవాడ తీసుకువచ్చిన సీఐడీ అధికారులు.. నేడు విజయవాడ సీఐడీ కోర్టులో హాజరుపరిచడంతో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడి అధికారులకు కోర్టు షాక్ ఇచ్చింది. భాస్కర్ తరపు న్యాయవాది కేసుకు సంబంధించిన పూర్వపరాలను తన వాదనల రూపంలో వినిపించారు. దీంతో భాస్కర్‌ రిమాండ్‌ను విజయవాడ సీఐడీ కోర్టు తిరస్కరించింది. భాస్కర్‌ను విచారించాలంటే నోటీసు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సీఐడీ కోర్టు తేల్పిచెప్పింది.

భాస్కర్ రిమాండ్‌ను తిరస్కరించిన విజయవాడ సీఐడి కోర్టు

ఇవీ చదవండి

Last Updated : Mar 10, 2023, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details