MLAs Poaching Case Updates: తెలంగాణలోని ఎమ్మెల్యేలకు ఎరకేసులో సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై హైకోర్టులో కౌంటర్ సమర్పించారు. ఇప్పటివరకు జాబితాలో లేని కొత్త పేర్లను అధికారులు ప్రస్తావించారు. 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు అందుకున్న వారి జాబితాను పేర్కొన్నారు. నిందితులతో అనుమానితుల కాల్ డేటాను న్యాయస్థానానికి సమర్పించారు. కీలక నేతలతో నిందితులు దిగిన ఫొటోలను.. వారు ప్రయాణించిన విమాన టికెట్ల వివరాలు సిట్ అధికారులు సేకరించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ అధికారుల కౌంటర్.. అందులో ఏముందంటే.. - హైకోర్టులో సిట్ అధికారుల కౌంటర్
MLAs Poaching Case తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఎరకేసులో అన్ని పిటిషన్లపై సిట్ అధికారులు హైకోర్టులో కౌంటర్ సమర్పించారు. అయితే నిందితులు కాల్‌డేటాను.. నిందితుల మధ్య సంభాషణ ఆధారాలను కౌంటర్‌లో సిట్ అధికారులు పేర్కోన్నారు.
నిందితుల మధ్య సంభాషణ ఆధారాలను కౌంటర్‌లో సిట్ అధికారులు పేర్కొన్నారు. నలుగురు నిందితుల వాట్సప్ చాటింగ్ వివరాలు .. ముగ్గురి కాల్ డేటా వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. నందు, రామచంద్ర భారతి, సింహయాజీ సంభాషణల ఆధారాలు.. బి.ఎల్.సంతోష్ వాట్సాప్ చాటింగ్ వివరాలు సమర్పించారు. ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయాల్సి ఉందని తెలిపారు. అనుమానితులకు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చామని చెప్పారు. అనుమానితులకు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆడియో టేప్‌లో వెలుగులోకి వచ్చిన వ్యక్తులపై దర్యాపు చేయాల్సి ఉందని సిట్ అధికారులు వెల్లడించారు. కోదండరాంను బీజేపీలోకి మార్చేందుకు సింహయాజీ ప్రయత్నించారని తెలియజేశారు. ఇద్దరు కాంగ్రెస్ నేతలు దామోదర ప్రసాద్, ముంజగల్ల విజయ్‌ను బీజేపీలోకి మార్చేందుకు ప్రయత్నించారని సిట్ అధికారులు కౌంటర్‌లో వివరించారు.
ఇవీ చదవండి: