కాలుష్య కోరల్లో కృష్ణమ్మ.. యథేచ్ఛగా మురుగునీరు నదిలోకి - latest telugu news
Sewage : ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలకు సాగు, తాగు నీరందిస్తున్న కృష్ణా నది కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. విజయవాడలో డ్రైనేజీల నుంచి మురుగునీరు, పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను నేరుగా రక్షణ గోడ మధ్యలో నుంచి గొట్టాల ద్వారా కృష్ణా నదిలోకి వదిలేస్తున్నారు. శుద్ధి చేయని మురుగునీటిని నేరుగా నదులు, కాలువల్లోకి వదలకూడదనే నిబంధన ఉన్నా.. అధికారులు మాత్రం మురుగు, వ్యర్థాలు నేరుగా రిటైనింగ్ వాల్ మధ్యలో నుంచి నదిలోకి చేరేలా ఏర్పాట్లు చేశారు. కనకదుర్గ వారధి దగ్గర.. రిటైనింగ్ వాల్ నుంచి నదిలోకి మురుగునీరు భారీగా చేరుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పులుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. కృష్ణా నది కాలుష్యంపై మరింత సమాచారాం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
కృష్ణా నదిలోకి మురుగునీరు