Service Roads Problems at Benz Circle in Vijayawada : విజయవాడలోని నోవాటెల్ హోటల్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు మొదటి ఫ్లైఓవర్ నిర్మాణం కుంచించుకుపోవడంతో దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని భారతీనగర్ తో పాటు దాని సమీప కాలనీలవాసులు హైకోర్టును ఆశ్రయించారు. సర్వీస్ రోడ్లు మూసుకుపోవడంతో ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారి వాదనలు విన్న కోర్టు సర్వీసు రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టాలని, నిబంధనల ప్రకారం 8 మీటర్లకు తగ్గకుండా సర్వీస్ రోడ్డును అభివద్ధి చేయాలని నాడు సింగిల్ జడ్జి ఎన్.హెచ్.ఏ.ఐ.(NHIA) ని ఆదేశించింది.
వైసీపీ పాలకుల నిర్లక్ష్యం - నాలుగున్నరేళ్ల పాలనలో 20 శాతం పనులనూ పూర్తి చేయని ప్రభుత్వం
Condition of Service Roads at Benz Circle : అయితే సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని ఎన్.హెచ్.ఏ.ఐ. సవాల్ చేసింది. ఇదిలా ఉండగా రెండో ప్లైఓవర్‌ను ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డును అభివద్ధి చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కొంత మంది స్థానికులు అప్పటిలోనే రిట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ఫకీర్ గూడెం జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మించేలా ఎన్.హెచ్.ఏ.ఐ. ని ఆదేశించాలని వారు కోర్టును అభ్యర్థించారు. రెండు అంశాలు ఒకే స్వభావంతో ఉన్నందున రెండింటిని కలిపి న్యాయస్థానం విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సర్వీస్ రోడ్లు వేయాలని అభిప్రాయపడింది. ఎన్.హెచ్.ఏ.ఐ. దాఖలు చేసిన రిట్‌ను కోర్టు కొట్టివేస్తూ సర్వీస్ రోడ్లు వేయాలని ఆదేశించింది. భూసేకరణకు అయ్యే ఖర్చును ఎన్.హెచ్.ఏ.ఐ. మరియు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఇరువురు చర్చలు జరిపి చర్యలు చేపట్టాలని కోర్టు పేర్కొంది.
Traffic Diversion: బెంజ్ సర్కిల్ పైవంతెన పనులు..ట్రాఫిక్ మళ్లింపు