Vijayawada Kendriya Vidyalaya: ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, అత్యాధునిక సదుపాయాలు, విలువలతో కూడిన విద్య, క్రమశిక్షణకు మారుపేరు ఆ విద్యాలయం. వ్యక్తిత్వంతో పాటు.. మానవీయ విలువలను బోధిస్తూ... ఉన్నతంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఆ విద్యాసంస్థ ప్రత్యేకత. విజయవాడ సత్యనారాయణపురంలోని కేంద్రీయ విద్యాలయం విశేషాలపై కథనం.
స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు: అత్యున్నత విద్యావిధానాలు పాటిస్తూ.. మెరుగైన ఫలితాలతో ముందడుగు వేస్తోంది విజయవాడ సత్యనారాయణపురంలోని కేంద్రీయ విద్యాలయం. ఇక్కడ చేరిన విద్యార్థులకు తొలి రోజు నుంచే ప్రత్యేక పాఠ్యప్రణాళికను ప్రారంభిస్తారు. కేవలం చదువు నేర్పడమే కాకుండా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతారు. మూడో తరగగతి నుంచి ప్లస్ టూ వరకు.. ప్రత్యేకంగా రూపొందించిన బోధనేతర కార్యక్రమాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో పిల్లలకు తర్ఫీదునిస్తున్నారు. క్రమశిక్షణ, దేశభక్తి భావనను పెంపొందిపజేస్తున్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా, ఎలాంటి అత్యవసర, విపత్కర పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేలా శిక్షణ ఇస్తున్నారు.