ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SC ST Farmers in Jagan Government: నా ఎస్సీ.. నా ఎస్టీలు.. అంటూనే కత్తరేశారు! సూక్ష్మసేద్యంపై విమర్శలతో దిగొచ్చిన జగన్ సర్కార్! - TDP Spend Money on Micro Irrigation Scheme

SC ST Farmers in Jagan Government: నా ఎస్సీ.. నా ఎస్టీ.. అంటూ గొంతు చించుకునే సీఎం జగన్.. వారి గుండెల్లో గునపాలు దించారు. ఎస్సీ, ఎస్టీ, రైతులకు ఎంతో ఉపయోగపడిన సూక్ష్మ సేద్య పథకాన్ని నీరు గార్చేశారు. తొలి మూడేళ్ల పథకాన్ని నిలిపేసిన జగన్.. విమర్శలకు జడిసి నాలుగో ఏడాది నుంచి అమలు చేస్తున్నారు. అది కూడా కొందరికే అందేలా కత్తెర్లు వేశారు.

Micro Irrigation Scheme in Implementation Discrimination
Micro Irrigation Scheme in Implementation Discrimination

By

Published : Aug 20, 2023, 8:22 AM IST

Updated : Aug 20, 2023, 9:09 AM IST

Micro Irrigation Scheme in Implementation Discrimination in YSRCP Government :తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రైతులకు సూక్ష్మసేద్యం పథకం కింద 100% రాయితీపై తుంపర, బిందు సేద్య పరికరాలిచ్చేవారు. రైతులు కోరిన వెంటనే ఈ పథకాన్ని వర్తింపజేసి, పరికరాలిచ్చేవారు. 2014-19 మధ్య కాలంలో ఈ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది. అయిదేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీ రైతుల కోసం రూ. 3,600 కోట్లను ఖర్చు చేశారు.

CM Jagan Cheating SC and ST Farmers : జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సూక్ష్మ సేద్య పథకాన్ని(Micro Irrigation Scheme) పక్కన పెట్టేశారు. ఈ పథకం తనది కాదన్న ధోరణితో తొలి మూడేళ్లపాటు అమలు చేయలేదు. రైతులకు ఎలాంటి పరికరాలనూ ఇవ్వలేదు. సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు కోసమని నాబార్డు నుంచి రూ. 616 కోట్ల రుణం తీసుకుని వాడేసుకుంది. గతంలో రైతులకు పరికరాలిచ్చిన సంస్థలకు బకాయిలు చెల్లించకుండా సతాయించింది. ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి డిమాండ్ విపరీతంగా పెరగడం, జగన్ తీరుపై తీవ్ర విమర్శలు రావటంతో ఆయన తలొంచక తప్పలేదు.

సంస్థలకు బకాయిలు చెల్లించి.. గతేడాది నుంచి పథకం అమలు చేస్తున్నారు. అయితే రాయితీని వంద శాతం నుంచి 90 శాతానికి తగ్గించేసి ఎస్సీ, ఎస్టీ రైతులను ఉసూరుమనిపించారు. 2022-23లో 2.27 లక్షల ఎకరాల్లో మాత్రమే పరికరాలను అమర్చారు. ఈ ఏడాది పూర్తి మందకొడిగా సాగుతోంది. 2.50 లక్షల ఎకరాల్లో అమలు చేయాల్సి ఉండగా.. ఆగస్టు 8 నాటికి 25 వేల ఎకరాలకే వర్తింపజేశారు. రైతులు పేర్లు నమోదు చేయించుకున్నాక నెలలు గడిచినా ఎవరూ పట్టించుకోవటం లేదు.

Avuku Tunnel Project Progress: ప్రతిపక్ష నేతగా గొంతెత్తిన జగన్.. అధికారం చేపట్టాక చేతులెత్తేశాడు!

TDP Spend Money on Micro Irrigation Scheme :టీడీపీ హయాంలో రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పదెకరాల విస్తీర్ణం వరకు 100% రాయితీపై గరిష్ఠంగా రూ.2.80 లక్షల వరకు వెసులుబాటు ఇచ్చారు. వైసీపీ హయాంలో అయిదెకరాలు పైబడిన రైతులకు 70% రాయితీ మాత్రమే అమలు చేస్తున్నారు. అంతేకాదు గతంలో ఈ పథకానికి సుమారు రూ.3,600 కోట్ల వరకు ఖర్చు చేయగా.. జగన్ సర్కారు అందులో సగం కూడా చేయలేదు.

రైతులపై మోయలేని భారం వేసిన వైసీపీ ప్రభుత్వం :ఈ పథకం పేరుతో పన్నుల రూపంలో ఎస్సీ, ఎస్టీ రైతులను జగన్ సర్కారు బాదేస్తోంది. బిందు, తుంపర సేద్య పరికరాలపై గతంలో ఉన్న వ్యాట్ భారాన్ని తప్పించేందుకు టీడీపీ ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేల వరకు మినహాయింపు ఇచ్చింది.

2018 నుంచి సూక్ష్మ సేద్య పరికరాలపై 12% జీఎస్టీ అమల్లోకి రాగా.. రైతులపై భారం తగ్గిస్తూ 6% వారు చెల్లించాలని, మిగిలిన 6% ప్రభుత్వం భరిస్తుందని 2018 మే 11న గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైసీపీ వచ్చాక మొత్తం పన్నుల్ని రైతులే భరించాల్సి వస్తోంది.

Farmers problems: రైతుకి 'భరోసా' ఇవ్వని కేంద్రాలు.. దీంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

ఆగస్టు 8న లోక్‌సభలో కేంద్రం ఇచ్చిన సమాధానం ప్రకారం.. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో మొత్తం 14,61,617 ఎకరాల్లోబిందు సేద్యం జరిగింది. అలాగే 4,88,652 ఎకరాల్లో తుంపర సేద్యం అమలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019-21 తొలి రెండేళ్లలో అసలు సూక్ష్మసేద్యం పథకం అమలు జరగలేదు. ఇక 2021-22 లో 31,635 ఎకరాల్లో బిందు సేద్యం, 5,000 ఎకరాల్లో తుంపర సేద్యం జరిగింది. 2022-23లో 1,76,167 ఎకరాల్లో బిందు సేద్యం, 50,770 ఎకరాల్లో తుంపర సేద్యం అమలు చేశారు.

ఇక ప్రస్తుత సంవత్సరంలో 20,365 ఎకరాల్లో బిందు సేద్యం, 4,728 ఎకరాల్లో తుంపర సేద్యం అమలు జరుగుతోంది. మొత్తం మీద వైసీపీ ప్రభుత్వంలో కేవలం 2,28,167 ఎకరాల్లో బిందు సేద్యం, 60,498 ఎకరాల్లో తుంపర సేద్యం మాత్రమే అమలు జరిగింది. ఈ గణాంకాలను పరిశీలిస్తేనే అర్థమవుతోంది. జగన్‌ సర్కార్‌ సూక్ష్మ సేద్య పథకం అమల్లో ఎంత వివక్ష చూపుతోంది.

'ధాన్యం కొనుగోలుకు "ఎస్​" చెప్పండి సీయం సారూ'.. రైతుల ఆవేదన

Micro Irrigation Scheme in Implementation Discrimination: సూక్ష్మ సేద్య పథకంపై జగన్‌ సవతి ప్రేమ.. ఎస్సీ, ఎస్టీ రైతులపై కక్ష
Last Updated : Aug 20, 2023, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details