ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీఏ ప్రకటన చేయాల్సింది ప్రభుత్వమా, ఉద్యోగ సంఘాల నేతలా : దేవరపల్లి సురేష్​బాబు - ap latest news

Sc, St Employees Association : ఉద్యోగులకు డీఏ చెల్లింపులో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు చేసిన ప్రకటనలపై.. ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ అధ్యక్షుడు స్పందించారు. తప్పుడు ప్రకటన చేసింది జేఏసీ నేతలో, ప్రభుత్వమో స్పష్టతనివ్వాలని అన్నారు.

Devarapalli Suresh Babu
దేవరపల్లి సురేష్ బాబు

By

Published : Jan 18, 2023, 2:16 PM IST

Sc, St Employees Association : ఉద్యోగుల డీఏపై ప్రభుత్వం మాట తప్పిందా, ఉద్యోగ సంఘాల నేతలు తప్పుడు ప్రకటనలు చేశారా అని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ ప్రశ్నించింది. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల తీరు అభ్యంతరకరమని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు అన్నారు. డీఏల ప్రకటన చేయాల్సింది ప్రభుత్వమా, ఉద్యోగ సంఘాల నాయకులా అని ప్రశ్నించారు. సంక్రాంతికి ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్​లో ఉన్న డీఏలో ఒక డీఏ చెల్లిస్తామని.. ముఖ్యమంత్రి తమతో చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించటంతో, ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళనకు గురయ్యారని ఆరోపించారు.

జేఏసీ నేతలు ప్రభుత్వం దగ్గర మెప్పుకోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఉద్యోగుల ప్రయోజనాలను, ఆత్మగౌరవాన్ని కాపాడేలా వ్యవహరించకపోవటం బాధకరమన్నారు. జేఏసీ నేతల వైఖరి వల్ల ఉద్యోగులలో.. ప్రభుత్వం పట్ల, ఉద్యోగ సంఘాల పట్ల నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఏ చెల్లింపుపై ముఖ్యమంత్రి ప్రకటించారో, ముఖ్యమంత్రి చెప్పకపోయినా నేతలే అబద్దాలు చెప్పారో స్పష్టం చేయాలన్నారు. జేఏసీ నేతలకు చేతనైతే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసేలా ముఖ్యమంత్రితో స్పష్టమైన ప్రకటన చేయించాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details