ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైసీపీ ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి: సర్పంచ్​ల ఆవేదన - Election of Sarpanch President

SARPANCH ASSOCIATION MEETING: పంచాయితీలో ప్రథమ పౌరుడిగా గర్వంగా చెప్పుకునే సర్పంచ్​కి వైసీపీ ప్రభుత్వంలో తీరని కష్టం వచ్చిందని సర్పంచ్​లు ఆవేదన పడుతున్నారు. తాము చేసిన పనులు బకాయిలు చెల్లించడం లేదని విజయవాడలో మీటింగ్ ఏర్పాటుచేసుకున్నారు. కానీ మీటింగ్ నీరుగారిపోయిందని నిరాశతో వెనుదిరిగారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 5, 2023, 9:43 PM IST

SARPANCH ASSOCIATION MEETING: వైసీపీ ప్రభుత్వంలో తాము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదన్నారు. చేసిన పనుల బకాయిలు ఇవ్వకపోవడంతో సర్వం అమ్ముకుని రోడ్డున పడ్డామని.. ఐక్యంగా పోరాడి సమస్యలను పరిష్కరించుకుందామని విజయవాడలో జరిగిన సర్పంచుల సంఘం రాష్ట్రస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పాల్గొన్నవారు రెండు వర్గాలుగా విడిపోయారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడుదామంటూనే.. మరోవైపు సీఎం జగన్‌ను, ప్రభుత్వాన్ని పొగిడితే ఎలా అని ఓ వర్గం సర్పంచ్‌లు ప్రశ్నించారు. కేవలం రాష్జ్ర అధ్యక్షుడు, కార్యవర్గం ఎన్నిక కోసం మాత్రమే సమావేశం నిర్వహిస్తున్నామని.. పోరాటాలపై తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని మరికొందరు సూచించారు. దీంతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది. చివరకు చిలకలపూడి పాపారావుని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత సమావేశాన్ని ముగించారు.

వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి: సర్పంచ్ ల ఆవేదన

ఇవీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details