ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sankalp Siddi: సంకల్పసిద్ధి కుంభకోణం డబ్బుతో.. ఈ భూములనే కొనుగోలు చేశారు - Vijayawada sankalpa Siddhi chain fraud today news

Sankalp Siddi Key Accused Kiran Trial Updates: గత సంవత్సరం నవంబర్ నెలలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంకల్ప సిద్ధి మార్ట్‌ గొలుసుకట్టు మోసం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గుత్తా కిరణ్‌ విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు..? ఏయే ప్రాంతాల్లో, ఏ రూపంలో ఆస్తులు కూడబెట్టారు? అనే తదితర వివరాలను అధికారులు రాబట్టారు.

Sankalp Siddi
Sankalp Siddi

By

Published : Apr 22, 2023, 4:36 PM IST

Sankalp Siddi Key Accused Kiran Trial Updates: విజయవాడలో సంచలనం సృష్టించిన సంకల్ప సిద్ధి గొలుసుకట్టు మోసం కేసులో.. నిందితుడు గుత్తా కిరణ్‌ విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారో..? ఏయే ప్రాంతాల్లో ఏ రూపంలో ఆస్తులు కూడబెట్టారో..? తదితర వివరాలను విచారణలో కిరణ్‌ వెల్లడించినట్లు తెలిసింది. ఎర్ర చందనం చెట్ల పెంపకం కోసం అంటూ.. కనిగిరి పరిసరాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.

సంకల్పసిద్ధి కుంభకోణం కేసులో కీలక నిందితుడు గుత్తా కిరణ్‌ను కర్ణాటకలో అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి రిమాండ్‌లో ఉన్న నిందితుడి నుంచి అధికారులు పలు కీలక అంశాలను రాబట్టారు. ఆయన వ్యక్తిగత విషయాలతోపాటు.. సంస్థ పెట్టుబడుల గురించి వివరాలు సేకరించారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా హుసదుర్గ తాలూకా గోరవినకల్‌ కిరణ్‌ స్వస్థలమని.. తొలుత సంజీవిని పచ్చళ్ల పేరుతో వ్యాపారం చేసినట్లు గుర్తించారు. ఆ సమయంలో సోదరుడి వరుస అయ్యే గుత్తా వేణుగోపాలకృష్ణతో కలిసి హైదరాబాద్‌లో.. 2017లో ప్లాంట్‌ ఎన్‌రిచ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ ప్రారంభించారు. అయితే, అది ఆశాజనకంగా ఉండడంతో మళ్లీ ఇద్దరూ కలిసి "రిచ్‌కేర్‌ లైఫ్‌ "అనే పేరుతో మరొక సంస్థను మొదలుపెట్టారు.

ఆ తర్వాత సంకల్ప మార్ట్‌ పేరుతో మరొకటి మొదలుపెట్టినా.. కొవిడ్‌ కారణంగా వ్యాపారం దెబ్బతింది. దీంతో ఇద్దరూ విడిపోయారు. కొద్ది రోజుల తర్వాత విజయవాడలో సంకల్పసిద్ధి ఈ-కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఎమ్.ఎల్.ఎమ్. సంస్థను స్థాపించినని.. నిర్వహణ చూసుకునేందుకు తిరిగి రావాలని కిరణ్‌ను వేణుగోపాలకృష్ణ పిలిచినట్లు విచారణలో తేలింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లను రాబట్టేందుకు ఏజెంట్లు, కోర్‌ కమిటీ ఏజెంట్లకు ఆకర్షణీయ పథకాలు, కమీషన్లను ప్రకటించినట్లు కిరణ్‌ విచారణలో వెల్లడించారు. దీంతో వ్యాపారం భారీగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో వచ్చిన ఆ డబ్బుతో ఎర్రచందనం చెట్లను పెంపకానికి అంటూ డిపాజిటర్ల డబ్బుతో భారీగా భూములను కొనుగోలు చేయటం ప్రారంభించారు.

ప్రకాశం జిల్లా కనిగిరి, చుట్టుపక్కల కొన్నారు. బుడగలేరు పంచాయతీ పరిధిలో 6 కోట్ల రూపాయలతో 40 ఎకరాలు, 1.30 కోట్ల రూపాయలతో అక్కడే 35 ఎకరాలు తీసుకున్నారు. బుడగలేరులో 20 ఎకరాలు, కనిగిరిలో 6.32 ఎకరాలు, 5.51 ఎకరాలు, 6.57 ఎకరాలు కొని విజయవాడలోని జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు గుర్తించారు. కనిగిరి ప్రాంతంలోనే 16 ఎకరాలు, 3.30 ఎకరాల భూములను కొని బాపులపాడు మండలంలోని కానుమోలు, గన్నవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేయించినట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల మండలంలో దాదాపు 14.28 ఎకరాలను కొనుగోలు చేసేందుకు బయానా కూడా ఇచ్చారు. కానీ.. అది ఇంకా రిజిస్ట్రేషన్‌‌ను చేయించలేదు. వీటితోపాటు.. బళ్లారిలో రెండు నివాస ప్లాట్లకు 69 లక్షలు, అనంతపురం జిల్లా కందుకూరులో 8.13 ఎకరాల కోసం 6.90 కోట్ల రూపాయలతో భూమిని కొనుగోలు చేశారు. కర్ణాటకలోని హోస్పేటలో రెండు నివాస ప్లాట్ల కోసం 67 లక్షల రూపాయల డబ్బులు చెల్లించారు. ఇంకా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కాలేదని పోలీసులు గుర్తించారు.

సంకల్పసిద్ధి కేసు విచారణలో విస్తుపోయే నిజాలు..

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details