ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎవరికి అధికారం ఇవ్వాలనేది ప్రజలు నిర్ణయిస్తారు.. పవన్​ కాదు: సజ్జల - ఆంధ్ర వార్తలు

Sajjala Ramakrishna Reddy : రైతు భరోసా యాత్రలో జనసేన అధినేత పవన్​ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్జి స్పందించారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చేయటమే పవన్​ బాధ్యతా అని ప్రశ్నించారు. అధికారం నిర్ణయించాల్సింది పవన్​ కల్యాణ్​ కాదని.. ప్రజలని అన్నారు.

Sajjala Ramakrishna Reddy
సజ్జల రామకృష్ణారెడ్జి

By

Published : Dec 19, 2022, 8:34 PM IST

Sajjala Ramakrishna Reddy : ఎవరికి అధికారం ఇవ్వాలనేది ప్రజలే నిర్ణయిస్తారని.. పవన్​ కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్జి అన్నారు. వైసీపీని అధికారంలోకి రానివ్వనని పవన్​ అంటున్నారని.. సంక్షేమ పథకాలు వద్దనీ అనుకుంటేనే జగన్​ను సీఎం కాకుండా ఆపటం సాధ్యమవుతుందని అన్నారు. పవన్​ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు పవన్​ ఎవరి తరపున మాట్లడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పవన్​ కల్యాణ్​ ఎవరో తయారు చేసిన స్క్రిప్ట్​ చదువుతున్నారని విమర్శించారు.

ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ప్రచారం కోసమే మాచర్లలో దాడులకు టీడీపీ ఉసిగొల్పిందని సజ్జల ఆరోపించారు. పలు హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న కృష్ణారెడ్డిని మాచర్లలో తెచ్చి పెట్టారని విమర్శించారు. మాచర్ల చంబల్​లోయ అయిందని అనటం సరికాదని అన్నారు. టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ నాయకులే తగలబెట్టారని ఎలా అంటారని ప్రశ్నించారు. నిజాలు ఎంటీ అనేది విచారణలో తేలుతుందని అన్నారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్జి

"వైసీపీ అధికారంలోకి రాకుండా చూడటమే తన బాధ్యత అన్నట్టు.. తన ప్రథమ కర్తవ్యం అన్నట్లు పవన్​ మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామంటారు. మరి గతంలో ఏం చేశారు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించటమే తన అజెండా అయితే గతంలో వైసీపీని ఎందుకు సంప్రదించలేదు. స్వతంత్రంగా వ్యవహరిస్తాననైనా చెప్పాలి.. 175 సీట్లలో పోటీ చేస్తామనైనా చెప్పాలి. చంద్రబాబు, జగన్​కు ధీటుగా నేను అని చెప్పాలి తప్పా ఇలా.. స్క్రిప్ట్​ ఎక్కడో తయారు చేసింది చదివితే ఇలాగే ఉంటుంది." - సజ్జల రామకృష్ణ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details