RTC Employees Worried on Higher Pension: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుంచి నేటిదాకా ఇటు పాత పింఛన్ హామీ నేరవేరక, అటు వేతన సవరణ బకాయిలు విడుదలకాక.. ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆదేశాలతో అధిక పింఛన్ పేరిట అదృష్టం తలుపుతట్టినా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీరుతో దాన్ని వినియోగించుకోలేక ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి.. ఆర్టీసీ ఉద్యోగులకు అధిక పింఛన్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, అర్హత కోల్పోయిన వారికి చెల్లింపు గడువును పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
PF Trust on Higher Pension: 2020లో సమారు 53 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను సీఎం జగన్.. ప్రభుత్వంలోకి విలీనం చేశారు. కానీ, పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామన్న హామీని మాత్రం మరిచారు. అంతేకాకుండా, ఓపీఎస్ అమలు కోసం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నా.. కనీసం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. 40 వేల మంది ఆర్టీసీఉద్యోగులు అధిక పింఛన్‌కు అర్హత పొందినట్లు పీఎఫ్ ట్రస్టు ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేశారు.
విజయవాడ బస్ స్టేషన్‌లో డిజిటల్ లావాదేవీలకు స్వస్తి- ప్రయాణికులు అవస్థలు
1200 Employees Lost High Pension: అంతేకాకుండా, ఉద్యోగులు వారి సర్వీసును బట్టి నిర్ణీత మొత్తాన్ని పీఎఫ్ ట్రస్టుకు జమ చేస్తే అధిక పింఛన్ వర్తింపజేస్తామని పీఎఫ్ ట్రస్టు తెలిపింది. ఆ మేరకు గడువును నిర్ణయించి నెల నెలా డిమాండ్ నోటీసులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో పీఎఫ్ ట్రస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 3 వేల మందికి పైగా ఉద్యోగులు డిమాండ్ నోటీసులు అందుకున్నారు. కానీ, వీరిలో 1200 మంది ఉద్యోగులు నగదు చెల్లించలేకపోయారు. ఫలితంగా రిటైర్మెంట్ తర్వాత అధిక పింఛన్ వచ్చే అవకాశాన్ని కోల్పోయారు. అయితే, నోటీసులు అందుకున్న ఉద్యోగులు నగదు చెల్లింపుల కోసం ఇప్పటికీ అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు.