ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో వారం రోజుల పాటు ఫీవర్‌ సర్వే.. అధికారులతో మంత్రి సమీక్ష - AP Medical and Health Department

Health Minister Vidadala Rajini Review Meeting: హెచ్‌3ఎన్‌2 వైరస్‌ ప్రభావం రాష్ట్రంలో ప్రస్తుతానికి లేదని, వాతావరణ మార్పుల వల్ల వచ్చే వైరల్‌ జ్వరాలు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్రంలో వారం రోజుల పాటు ఫీవర్‌ సర్వే నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. బహిరంగ ప్రదేశాలు, జనసమ్మర్థ ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Vidadala Rajini
విడదల రజని

By

Published : Mar 9, 2023, 2:09 PM IST

Health Minister Vidadala Rajini Review Meeting: రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్, వడ దెబ్బపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. జూమ్ ద్వారా వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, ఉన్నతాధికారులు, 26 జిల్లాల డీఎంహెచ్​వోలు, 16 జీజీహెచ్​ల సూపరింటెండెంట్​లు పాల్గొన్నారు. వైరల్ ఫీవర్స్​పై అప్రమత్తంగా ఉన్నామని క్రిష్ణ బాబు తెలిపారు. విలేజ్ హెల్త్ క్లినిక్​ల స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామన్న క్రిష్ణ బాబు.. ఏర్పాట్లపై డీఎంహెచ్​వోలకు పలు ఆదేశాలిచారు.

ఇన్ఫ్లూయంజా వైరస్, వడదెబ్బ తీవ్రతపై కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన సూచనల మేరకు అప్రమత్తంగా ఉన్నామన్నారు. తక్షణం వారం రోజులపాటు ఫీవర్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. వడ దెబ్బకు గురికాకుండా ప్రజల్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్​వోలకు ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థల్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలు బయట తిరగకుండా హెచ్చరికలు జారీ చెయ్యాలన్నారు. ప్రజల్లో అవగాహన పెద్ద ఎత్తున కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్లతో డీఎంహెచ్వోలు సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

ఎన్జీవోలతో కలెక్టర్లు సమావేశాన్ని ఏర్పాటు చేసేలా డీఎంహెచ్వోలు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. శీతల నీటి కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి, ఓఆర్​స్ ప్యాకెట్లు విలేజ్ క్లినిక్​ల స్థాయిలో సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్ఆర్​జియస్ క్యాంపుల్లో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. డీహైడ్రేషన్​కు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించే విషయంలో ఎమ్​ఎల్​హెచ్పీలకు తగిన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఎంఎల్​హెచ్​పీలు, ఎఎన్ఎంలు సమన్వంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

వారం రోజుల్లోగా ఫీవర్ సర్వే పూర్తి చేసేలా డీఎంహెచ్వోలు తక్షణమే రంగంలోకి దిగాలన్నారు. విలేజ్ వాలంటీర్ల సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, జన సమ్మర్థ ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాలేజీలు, స్కూళ్లలో పరిస్థితులననుసరించి తగిన చర్యలు తీసుకునేలా ఆయా శాఖలకు పలు సూచనలు చేయాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్​కు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 14వ తేదీన రాష్ట్రంలో నేషనల్ డీవార్మింగ్​డే ఏర్పాట్లపై పలు సూచనలు చేసారు.

ఎండీవోల వద్ద నుంచి నులిపురుగు మాత్రల్ని తీసుకునేలా ఎమ్ఎల్​హెచ్పీలు , ఏఎన్ఎంలు సమన్వయం చేసుకోవాలన్నారు. రక్తహీనత నివారణలో భాగంగా.. నులిపురుగుల నివారణ అత్యంత అవసరమని స్పష్టం చేశారు. రెండు రోజుల ముందుగానే నులిపురుగుల మాత్రలు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. తక్షణం లక్ష సికిల్ సెల్ కిట్లు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ నెలలో 3 లక్షల సికిల్ సెల్ అనీమియా కిట్ల పంపిణీ లక్ష్యం పెట్టారు.

సికిల్ సెల్ అనీమియా పేషంట్​లకు కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. సిజేరియన్ ఆపరేషన్లపై కలెక్టర్లు జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసేలా డీఎంహెచ్వోలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నోటిఫైబుల్ వ్యాధులను నమోదు చేసే విషయంలో ప్రైవేటు ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. డీఎంహెచ్వోలు విజిట్ చేసి పరిశీలించాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అప్లోడ్ చేస్తున్నదీ లేనిదీ పరిశీలించాలని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details