Retired Supreme Court Justice Gopala Gowda: దేశంలో కోట్లాది మందికి అన్నం పెట్టే రైతులు కంట కన్నీరు పెడుతున్నారని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాల గౌడ తెలిపారు. విజయవాడలో జరిగిన రైతు గర్జన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నాటి ప్రధాని నెహ్రూ రైతుల కోసం మంచి సంస్కరణలు అమలు చేశారని, ప్రస్తుతం కార్పొరేట్లకు తప్ప సామాన్యులకు న్యాయం చేయని వ్యక్తి ప్రధాన మంత్రి ఉన్నారని చెప్పారు. 67శాతం రైతులు ఎండనక, వాననక కష్టపడి పని చేస్తారని పెర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు ఎటువంటి మేలు చేశారో చెప్పాలన్నారు.
కేంద్రం బడ్జెట్లో రైతులకు ఎటువంటి మేలు చేశారో చెప్పాలి: గోపాల గౌడ
Retired Supreme Court Justice Gopala Gowda: విజయవాడలో జరిగిన రైతు గర్జన సదస్సులో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాల గౌడ పాల్గొన్నారు. కేంద్రం ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు ఎటువంటి మేలు చేశారో చెప్పాలన్నారు. ప్రధాని మోదీ చేసిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢీల్లోలో రైతులు అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు.
రైతులకు రాయితీలు, సదుపాయాలు కేటాయించ లేదన్నారు. రైతు ఉత్పత్తుల్లో కూడా కార్పొరేట్ వర్గాలు చొరబడ్డాయని వివరించారు. ప్రధాని మోదీ చేసిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢీల్లోలో రైతులు అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ పోరాటంలో పలువురు రైతులు ప్రాణాలు వదిలారని అవేదన వ్యక్తం చేశారు. రైతులు సంఘటితంగా పోరాటం చేయడం వల్లే మూడు చట్టాలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. గిట్టుబాటు ధర ద్వారా రైతులకు న్యాయం జరిగే వరకు రాజకీయాలకు అతీతంగా అందరూ పోరాటం చేయాలన్నారు.
ఇవీ చదవండి: