ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో సంస్కరణలు

Tenth, ninth Exams New Pattern : తెలంగాణలో తొమ్మిది, పదో తరగతుల పరీక్షల విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. ఈ రెండు తరగతులకు పరీక్షలను ఇక నుంచి ఆరు పేపర్లలోనే నిర్వహించనున్నట్లు ఉత్వర్వులు జారీ చేసింది.

By

Published : Dec 28, 2022, 7:38 PM IST

Tenth Exams New Pattern in Telangana
తొమ్మిది, పది పరీక్షలో మార్పులు

Tenth Exams New Pattern in Telangana : తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. 2022-23 నుంచి ఈ సంస్కరణలు అమలు చేయనుంది. ఇకపై 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌లో 80 సమ్మేటివ్​, ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయించింది. సైన్స్‌ పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీకి చెరి సగం మార్కులు కేటాయించింది. సైన్స్ మినహా ఇతర అన్ని సబ్జెక్టులకు మూడు గంటల పరీక్షా సమయాన్ని ఇచ్చింది. సైన్స్ పరీక్షకు మాత్రం 3 గంటల 20 నిమిషాల సమయాన్ని ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏ పరీక్షకు ఎన్ని మార్కులు: పదో తరగతి పరీక్షల పేపర్లను రాష్ట్ర ప్రభుత్వం 11 నుంచి ఆరుకు తగ్గించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి పరీక్షల్లో మార్పులు, చేర్పులు అమలు కానున్నాయి. తొమ్మిది, పదోతరగతికి చెందిన పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి వంద మార్కులు ఉంటాయి. ఇందులో ఫార్మేటివ్ అసెస్ మెంట్స్​కు 20 చొప్పున మార్కులు... తుది పరీక్షకు 80 చొప్పున మార్కులు ఉంటాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకు గాను 600 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఏ పరీక్షకు ఎంత సమయం: సైన్స్ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్​కు చెరి సగం మార్కులు ఉంటాయి. సైన్స్ పరీక్షకు సమయం మూడు గంటలా 20 నిమిషాలు ఇస్తారు. ఫిజికల్ సైన్సెస్, బయోలజికల్ సైన్సెస్​కు గంటా 30 నిమిషాల పాటు సమయం ఇస్తారు. మధ్యలో ఫిజికల్ సైన్సెన్స్ సమాధాన పత్రాలు తీసుకునేందుకు, బయోలజికల్ సైన్సెస్ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చేందుకు 20 నిమిషాల సమయం ఉంటుంది. మిగిలిన ఐదు సబ్జెక్టులకు మూడు గంటల పాటు పరీక్షా సమయం ఉంటుంది. కాంపోజిట్ కోర్సులు ఉంటే కూడా 20 నిమిషాల అదనపు సమయం ఇస్తారు. ఒకేషనల్ విభాగం పరీక్షల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, ప్రస్తుత విధానం యథాతథంగా కొనసాగుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details