Reduced Campus Placements in Colleges: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంగణ నియామకాల జోరు తగ్గింది. కొన్నేళ్లుగా కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు నామమాత్రంగా జరుగుతుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాంగణ నియామకాల కోసం ఆశగా ఎదురుచూడటం తప్ప, కంపెనీల నుంచి పిలుపు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రాంగణ నియామకాలు నిరాశాజనకంగా కొనసాగుతుండడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
50 Percent placements Reduced in Colleges: దేశ వ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో ప్రాంగణనియామకాలుగత ఏడాదితో పోల్చి చూస్తే, సుమారుగా 50 శాతం మేరకు తగ్గుముఖం పట్టాయి. దీని ప్రభావం విద్యాసంస్థలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి కృష్ణా, గంటూరు జిల్లాలపై పడింది. గతంలో కళాశాలల్లో ప్రాంగణ ఎంపికలు వందల సంఖ్యలో జరిగేవి. కానీ, ఇప్పుడా ఆ పరిస్థితి తారుమారు అయ్యింది. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకే కాదు పీజీ, డిగ్రీ విద్యార్థులకు సైతం సంక్షోభం సవాల్‌ను విసురుతోంది. ఇంజనీరింగ్ 8వ సెమిస్టర్ ప్రారంభమైనా 10శాతం కూడా ప్రాంగణ ఎంపికలు జరగని పరిస్థితి నెలకొంది. ఆర్థికమాంద్యం కారణంగా పలు సంస్థలు ఇప్పటికే కొలువులకు కోత పెట్టడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.
విద్యార్థులకు వైసీపీ సర్కార్ తీరని ద్రోహం - భారీగా తగ్గిన ప్రాంగణ నియామకాలు
Reduced placements in Krishna, Guntur Colleges: కొన్ని సంస్థలు ఎంపికలు పూర్తి చేసినా ఆఫర్ చేసే ప్యాకేజీలను తగ్గిస్తున్నాయి. రెండు జిల్లాలకు సంబంధించి కొన్ని పేరున్న కళాశాలల్లో నామమాత్రంగా ప్రాంగణ ఎంపికలు జరుగుతుండగా, మిగతా కళాశాలల్లో ఆ ఊసే లేదు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో గతంలో కొందరిని ఎంపిక చేసినప్పటికీ, వేరే ఉద్యోగాలు చూసుకోవాలని ఆయా సంస్థల నుంచి విద్యార్థులకు మెయిల్స్ వస్తుండడంతో అయోమయానికి గురవుతున్నారు. దీంతోపాటు కంపెనీలు ప్రాంగణ ఎంపికల తేదీలు ప్రకటించి, పరీక్షలను రద్దు చేస్తుడడంతో విద్యార్థులు వాపోతున్నారు.