ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయలసీమ ప్రజలను సీఎం మోసం చేస్తున్నారు: దశరథ రామిరెడ్డి

Rayalaseema: పరిపాలన వికేంద్రీకరణ తోనే అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంత వాసులను మోసం చేస్తున్నారని రాయలసీమ హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షులు దశరధి రామిరెడ్డి అన్నారు. 2014 విభజన చట్టంలో రాయలసీమ సాగు సాగునీటికై పొందుపరిచిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాయలసీమ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

రాయలసీమ సత్యాగ్రహ దీక్ష
రాయలసీమ సత్యాగ్రహ దీక్ష

By

Published : Nov 16, 2022, 7:59 PM IST

Rayalaseema: పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంత వాసులను మోసం చేస్తున్నారని రాయలసీమ హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి అన్నారు. 2014 విభజన చట్టంలో రాయలసీమ సాగు సాగునీటికై పొందుపరిచిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాయలసీమ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీంట్లో భాగంగా విభజన చట్టంలో రాయలసీమ అభివృద్ధికై పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై.. రాయలసీమ అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డి వట్టి మాటలే చెబుతున్నారని విమర్శించారు. పాలన వికేంద్రీకరణతో రాయలసీమ అభివృద్ధి చెందదని ప్రజలకు తెలుసని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details