ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవో నెం.1పై హైకోర్టులో పిల్​ దాఖలు చేసిన రామకృష్ణ

Ramakrishna filed litigation in the High Court: బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల గొంతు నొక్కడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం జీవో 1 తీసుకొచ్చిందని పేర్కొంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ జీవో రహదారులపై బహిరంగ సమావేశాలను పరోక్షంగా నిషేధం విధిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, అధికరణ 19(1)(ఏ)(బి)కు విరుద్ధంగా ఉన్న జీవో 1ను రద్దు చేయాలని కోరారు.

Ramakrishna
రామకృష్ణ

By

Published : Jan 10, 2023, 10:48 PM IST

Ramakrishna filed litigation in the High Court: ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 1 ను కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిల్‌ దాఖలు చేశారు. రాష్ట్రంలోని రహదారులు, మార్జిన్లలో బహిరంగ సమావేశాలను నిషేధిస్తూ రాష్ట్ర హోంశాఖ ఈనెల 2న జీవో 1ని జారీచేసింది. రహదారులపై సమావేశాలు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయని అందులో పేర్కొంది. పోలీసు చట్టంలోని సెక్షన్‌ 30(2) ఊరేగింపులకు సంబంధించిన నియమ నిబంధనలను తెలియజేస్తోంది.

రహదారులు, వీధుల్లో నిర్వహించే సమావేశాలు, ఊరేగింపులు, యాత్రల నిర్వహణ/నియంత్రణ విషయంలో మాత్రమే పోలీసు చట్టం సెక్షన్‌ 30(2) పోలీసులకు అధికారం కల్పిస్తోంది. అది కేవలం నియంత్రణ అధికారం మాత్రమే. రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహణకు అనుమతి ఇవ్వకుండా జీవో 1 పూర్తిస్థాయి నిషేధం విధిస్తోంది. ఆ జీవో చట్ట విరుద్ధం. అధికరణ 19(1)(ఏ)(బీ)లను ఉల్లంఘించేదిగా ఉంది. ఈ జీవోపై ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఏడాది జనవరి 2న ప్రభుత్వం జారీచేసిన జీవో1ని రద్దు చేయాలని రామకృష్ణ కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details