Raised Social Security Pension: 250 పెంపుతో నేటి నుంచి 2 వేల 750 రూపాయల చొప్పున సామాజిక భద్రత పింఛన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాజమహేంద్రవరంలో 3వ తేదీ నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ లాంఛనంగా ఈ పెంచిన పింఛన్ల మొత్తాన్ని లబ్ధిదారులకు అందించనున్నారు. రూ.2,750 చొప్పున సామాజిక భద్రత పింఛను ఇవ్వనున్నారు. అర్హులైన వారికి కొత్తగా మంజూరు చేసిన పింఛను, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు.
పింఛన్ రూ.2,750.. నేటి నుంచి పెంపు వారోత్సవాలు - Andhra Pradesh latest news
Raised Social Security Pension: 250 పెంపుతో నేటి నుంచి 2 వేల 750 రూపాయల చొప్పున సామాజిక భద్రత పింఛన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ.2,750 చొప్పున సామాజిక భద్రత పింఛను ఇవ్వనున్నారు. వైఎస్ఆర్ పింఛను కానుక కింద కొత్తగా 2 లక్షల31 వేల 463 మందికి పింఛన్లు అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. పింఛన్ల పంపిణీకి అవసరమైన 1765 కోట్ల రూపాయల్ని సీఎం విడుదల చేశారన్నారు.
Raised YSR pension
నేటి నుంచి వారం రోజులపాటు నిర్వహించే పింఛను పెంపు వారోత్సవాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్ఆర్ పింఛను కానుక కింద కొత్తగా 2 లక్షల31 వేల 463 మందికి పింఛన్లు అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. పింఛన్ల పంపిణీకి అవసరమైన 1765 కోట్ల రూపాయల్ని సీఎం విడుదల చేశారన్నారు.
ఇవీ చదవండి