ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెరాసతో పొత్తు ప్రసక్తే లేదు.. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ మోదీ నాశనం చేశారు' - bharat jodo yatra in rangareddy

Rahul Gandhi Fires on BJP and TRS: కేంద్రంలోని భాజపా, తెలంగాణ రాష్ట్రంలోని తెరాసలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ నాశనం చేశారని.. మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ పెద్దల కోసమే పని చేస్తోందని రాహుల్‌ ఆరోపించారు. భాజపా, తెరాసలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయన్న ఆయన..తెలంగాణ రాష్ట్రంలో తెరాసతో ఎలాంటి అవగాహన కానీ.. పొత్తులు కానీ ఉండవని వెల్లడించారు.

rahul gandhi
rahul gandhi

By

Published : Oct 31, 2022, 4:22 PM IST

Rahul Gandhi Fires on BJP and TRS: ప్రధాని మోదీ పాలనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ నాశనం చేశారని.. వ్యవస్థలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ పాలనలో ఉద్యోగ కల్పన లేదని పేర్కొన్న ఆయన.. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే భాజపా హింసను ప్రేరేపిస్తోందని.. దేశవ్యాప్తంగా విద్వేషాలు వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. భాజపా అనుసరిస్తున్న విధానాలను అందరూ వ్యతిరేకించాలన్న రాహుల్‌.. తాము అధికారంలోకి వచ్చాక అన్నింటినీ ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ పెద్దల కోసమే పని చేస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. భాజపా, తెరాసలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయన్నారు. ఎన్నికలొచ్చినప్పుడు ఆ రెండు పార్టీలు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయన్న ఆయన.. ఆ పార్టీలకు అన్ని రూ.వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. భాజపాపై యుద్ధం 2 నిమిషాల్లో ముగిసేది కాదని.. వచ్చే పార్లమెంటు ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరిగే పోరాటమని రాహుల్‌ వ్యాఖ్యానించారు. 2024లో విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటంగా ఎన్నికలు ఉండబోతున్నాయని స్పష్టం చేశారు.

ప్రధాని రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకున్నారు. వ్యవస్థలన్నింటిని నాశనం చేశారు. దేశవ్యాప్తంగా భాజపా విద్వేషాలు వ్యాప్తి చేస్తోంది. హింసను ప్రేరేపిస్తోంది. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగింది.. ఉద్యోగ కల్పన లేదు. మేం అధికారంలోకి వచ్చాక అన్నింటినీ ప్రక్షాళన చేస్తాం. భాజపా, తెరాస రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఆ పార్టీలకు రూ.వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి..? భాజపా, తెరాస ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయి. భారత్‌ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తుంది. అన్ని రాష్ట్రాల నుంచి వెళ్లేలా పాదయాత్ర ప్రణాళిక చేశాం. తెరాసతో పొత్తులు ఉండొదన్నది రాష్ట్ర నాయకత్వ నిర్ణయం. రాష్ట్ర నాయకత్వ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో తెరాసతో ఎలాంటి అవగాహన కానీ.. పొత్తులు కానీ ఉండవు.- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు..: ఈ క్రమంలోనే కాంగ్రెస్‌-తెరాస మధ్య ఎలాంటి అవగాహన లేదని రాహుల్‌గాంధీ వెల్లడించారు. తెరాసతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. తెరాసతో పొత్తులు ఉండొదన్నది రాష్ట్ర నాయకత్వ నిర్ణయమన్న ఆయన.. రాష్ట్రంలో తెరాసతో ఎలాంటి అవగాహన కానీ.. పొత్తులు కానీ ఉండవని తేల్చి చెప్పారు. రాష్ట్ర నాయకత్వ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

యాత్రకు భారీ మద్దతు..: మరోవైపు భారత్‌ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తుందని రాహుల్‌ హర్షం వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు యాత్ర సాగుతుందని.. అన్ని రాష్ట్రాల నుంచి వెళ్లేలా పాదయాత్ర ప్రణాళిక చేశామని వివరించారు. భారత్‌ జోడో యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతున్నామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details