Purandeshwari on Liquor Manufacturing Companies Names:రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లను ప్రజాక్షేత్రంలో పెట్టగలరా..? అని సవాల్ విసిరారు. ఇవాళ సాయంత్రానికల్లా దమ్ము, ధైర్యం ఉంటే కంపెనీల యజమానుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం తయారు చేసినా, అమ్మినా ఏడేళ్ల జైలుశిక్ష విధించాలని ఆనాడు జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు ఏమాయ్యాయని ఆమె నిలదీశారు.
మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి Purandeshwari Media conference on Alcohol: గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో విక్రయిస్తున్న కల్తీ మద్యం విషయంలో బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కల్తీ మద్యం తాగి రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలు ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించి ఆధారాలను వెల్లడించారు. తాజాగా మరోసారి మద్యం విక్రయాలపై జాతీయ, క్రిస్టిన్ సంస్థలు చేసినా సర్వేల విషయాలను ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.
BJP State President Purandeswari on AP Liquor: ఏపీలో ఏరులై పారుతోన్న మద్యం.. విచారణ జరిపించాలని అమిత్‌షాకు పురందేశ్వరి విజ్ఞప్తి
Purandeshwari Comments:''గతకొద్దీ రోజులుగా మద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న అవినీతిని, అక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ వస్తున్నాను. ఈ క్రమంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మద్యంపై పలు వివరాలు ఇచ్చారు. అయితే, అవన్నీ నిజాలా..?, కాదా..? అనే విషయాలను నేను వెల్లడిస్తున్నాను. మద్యంపై వైసీపీ మంత్రులు చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే మన రాష్ట్ర మద్యంపై జాతీయ సంస్థ (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) పరిశోధన చేసి ఓ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 80లక్షల మంది మద్యాన్ని సేవిస్తున్నట్లు తెలిపింది. అంటే 34.5శాతం మంది మద్యాన్ని సేవిస్తున్నారు.'' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.
Union Minister Bharati Pravin Pawar : నాసిరకం మద్యానికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది : కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్
Purandeshwari on YSRCP GOvt:అనంతరం రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలు నడుపుతున్న యజమానులంతా వైఎస్సార్సీపీ వాళ్లేనని పురందేశ్వరి అన్నారు. ధైర్యం ఉంటే మద్యం కంపెనీల యజమానుల పేర్లన్నీ బయటపెట్టాలని జగన్ ప్రభుత్వానికి ఆమె సవాల్ విసిరారు. మద్యం తయారుచేసినా.. అమ్మినా ఏడేళ్ల జైలుశిక్ష విధించాలని ఆనాడు జగన్ చెప్పిన మాటలను గుర్తు చేసినా పురందేశ్వరి.. ఇప్పుడు మద్యం తయారుచేస్తున్నవారిపై కేసులు పెట్టి, ఏడేళ్ల జైలుశిక్ష వేయించేలా..?, చర్యలు తీసుకుంటారా..? అని హెచ్చరించారు. మద్యం విక్రయంలో ఎందుకు డిజిటిల్ పేమెంట్స్‌ను అమలు చేయట్లేదు..? అని ఆమె నిలదీశారు. రోజుకూ ఎంత మద్యం విక్రయిస్తున్నారు..?, ఎంత మద్యం దాచిపెట్టారు..? అనే వివరాలను ఈరోజు సాయంత్రంకల్లా ప్రజల ముందు పెట్టాలని పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Purandeshwari again fire Jagan Govt: రాష్ట్రంలో అరాచక, కక్ష్యపూరిత రాజకీయం నడుస్తోంది: దగ్గుబాటి పురందేశ్వరి