Power employees protest : విద్యుత్ ఉద్యోగులు ఛలో విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ 8వ తేదీ చలో విజయవాడ పిలుపునిచ్చిచారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఈ ఆందోళన కార్యక్రమానికి విద్యుత్ ఉద్యోగులు(electricity employees) రానున్న సందర్భంగా.. పోలీసులు, యాజమాన్యం అభ్యర్థన మేరకు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిలుపుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు జేఏసీ నాయకులు ప్రకటించారు.
Electricity employees strike: సమ్మెకు దిగడమే సమస్యలకు పరిష్కారం..విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గత నెల 20వతేదీన యాజమాన్యానికి నోటీస్ ఇచ్చామని, ఎన్ని సార్లు చర్చలు జరిపినా ప్రభుత్వం, యాజమాన్యం హామీ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, యాజమాన్య అభ్యర్ధన మేరకు చలో విజయవాడ కార్యక్రమం నిలిపివేసి, వర్క్ టు రూల్ నిరసన కార్యక్రమం యధావిధిగా కొనసాగిస్తామని చెప్పారు.
Electricity Subsidy : ఏపీలో విద్యుత్ రాయితీపై కోతలు.. 2.35 లక్షల కుటుంబాలకు షాక్..
ఆగస్టు 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె...ఈ నెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని, కాంట్రాక్టు కార్మికులకు నేరుగా వేతనాలు ఇస్తామని సీఎం జగన్(CM Jagan) పాదయాత్రలో హామీ ఇచ్చారని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ కన్వీనర్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. 12 డిమాండ్లపై యాజమాన్యానికి నోటీస్ ఇచ్చామన్నారు. స్పందన రాకుంటే ఆగస్టు 10 నుంచి నిరవధిక సమ్మె వెళ్లనున్నామని తెలిపారు.