TRIBUTES TO NTR : మహానటుడిగా, ప్రజానాయకుడిగా ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన శకపురుషుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా.. జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశా నిర్దేశం చేసిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయాల్లో మహిళలు బడుగు వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు, అట్టడుగు వర్గాలకు సంక్షేమాన్ని అందించేందుకు.. మహిళలకు ఆస్తి హక్కు, బీసీలకు రిజర్వేషన్లు, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలతో సమసమాజ స్థాపనకు బాటలు వేసిన ఎన్టీఆర్ ఆశయ సాధనకు అందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు.