MLAs BUYING CASE: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులైన రామచంద్రభారతి, నందకుమార్‌లను బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. బోగస్ ఆధార్, పాన్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కేసులో రామ చంద్ర భారతి, నందకుమార్‌లను ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపర్చారు. దోమ మండలంలో సతీశ్ అనే వ్యక్తి భూమి వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు మేరకు.. నందకుమార్ మీద ఐపీసీ 386, 387 సెక్షన్ల కింద నమోదైన కేసులో అరెస్ట్ చేశారు.
జైలు నుంచి విడుదలైన వెంటనే గేటు దగ్గర మళ్లీ అరెస్టు - ఎమ్మెల్యేల ఎర కేసు
MLAs BUYING CASE: ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులు ఉదయం బెయిల్‌పై విడుదలవ్వగా.. ఇతర కేసుల్లో పోలీసులు వారిని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. కారాగారం గేటు వద్దే కాపు కాసిన పోలీసులు, గేటు దాటిన వెంటనే అరెస్టు చేశారు. వారిని ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
రామచంద్రభారతి,నందకుమార్
నిన్న వీరిద్దరికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ఉదయమే విడుదల కాగా... పోలీసులు వారిని ఇతర కేసుల్లో అరెస్టు చేశారు. కారాగారం నుంచి తమ వస్తువులతో ఇద్దరూ బయటికి రాగా.. అప్పటికే గేటు వద్ద పోలీసులు కాపు కాశారు. నిందితులిద్దరూ గేటు దాటిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో ఇద్దరినీ ఎక్కించారు. ఇక ఇదే కేసులో సిట్ మెమో కొట్టివేత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిసాయి. దీనిపై కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది.
ఇవీ చూడండి: