Destroyed Alcohol bottles In Ntr District: రెండేళ్లలో తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు దొరికిన రూ. 5.47 కోట్ల విలువైన మద్యం సీసాలను బుధవారం పోలీసులు ధ్వంసం చేశారు. తోటచర్ల జాతీయ రహదారి పక్కనున్న ప్రైవేటు వెంచరులో సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ మేరీ ప్రశాంతి, ఎస్‌ఈబీ ఏఎస్పీ సత్తిబాబు పర్యవేక్షణలో మద్యం సీసాలను ధ్వంసం చేశారు.
Alcohol bottles Destroyed: ఐదు కోట్ల 47 లక్షల విలువైన మద్యం ధ్వంసం.. - అక్రమ మద్యం
Destroyed Alcohol: ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు.. దానిని ధ్వంసం చేశారు. ఏడాది కాలంగా పట్టుకున్న మద్యాన్ని ఒకేసారి ధ్వంసం చేశారు. దీని విలువ సుమారు ఐదు కోట్ల 47 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా. ఇంతకీ ఇది ఎక్కడంటే..
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నందిగామ సబ్ డివిజన్ పరిధిలో మద్యం అక్రమ రవాణాకు సంబంధించి పలు పోలీస్‌స్టేషన్లలో 6,075 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. వివిధ బ్రాండ్ల్లకు చెందిన 2,43,385 మద్యం సీసాలు పట్టుకున్నట్లు చెప్పారు. ఒకేసారి రూ. 5.47 కోట్ల విలువైన మద్యం సీసాలను ధ్వంసం చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని చెప్పారు. రోడ్డుపై సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు సీసాలు పెట్టారు. మూడు రోలర్లతో ధ్వంసం చేశారు. ఆ ప్రక్రియను పరిశీలించేందుకు తోటచర్లతో పాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిండెంటెండ్ పి.నారాయణస్వామి, నందిగామ ఏసీపీ నాగేశ్వరరెడ్డి, సీఐలు నాగేంద్రకుమార్, చంద్రశేఖర్, ఎస్సైలు, ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చదవండి: