ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ పందులకు ఏమైంది.. వింత వ్యాధితో వేలల్లో మృతి.. ఆందోళనలో పెంపకందారులు - unknown disease in penuganchiprolu ntr District

1000 Pigs Died With In 15 Days: కరోనా రాకతో ఎప్పుడు ఏమవుతుందోనన్న గుబులు ఆందరిలోను వ్యక్తమవుతోంది. ఏ చిన్న వ్యాధి లక్షణాలు కనిపించినా.. సర్వత్రా ఆందోళన నెలకొంటుంది. ఇటీవల కాలంలో ఆవులపై నల్లమచ్చ వ్యాధులు, ఇతర జీవుల్లో ఆసక్తిని పెంచే వ్యాధి లక్షణాలు తరచు బయటపడుతున్నాయి. అలాంటి కోవకు చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపోలులో ఆందోళన రేకిత్తిస్తోంది. అంతు చిక్కని వ్యాధితో ఈ పట్టణంలోని పందులు వందల సంఖ్యలో మృతి చెందడం.. చర్చాంశనీయమైంది.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 12, 2023, 9:49 PM IST

1000 Pigs Died With In 15 Days : ఆ ఊరి ప్రజలకు పందులే జీవాధారం. అటువంటి పందులు చనిపోతుంటే వారి హృదయం కన్నీరు పెడుతోంది. మేము కడుపు నింపుకునేదెలా అని విలవలలాడుతున్నారు. తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని తెలియక దిగాలుగా కూర్చోని ఆలోచిస్తున్నారు. వారి గ్రామంలో పందుల చనిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. అంతు చిక్కని వ్యాధితో గడిచిన 15 రోజుల వ్యవధిలోనే సుమారు వెయ్యి పందుల వరకు మృతి చెందినట్లు బాధితులు చెబుతున్నారు. మేతకు వెళ్లిన పందులు ఎక్కడివి అక్కడే మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని వందల పందులను పూడ్చిపెట్టగా, గత వారం రోజులుగా చనిపోయిన పందుల కళేబరాలు కుళ్లిపోయి మునేరులో దర్శనమిస్తున్నాయి. తిరుపతమ్మ తిరునాళ్లకు వచ్చిన భక్తులు సంచరించే ప్రాంతంలోనే చనిపోయి ఉండటంతో చూసిన భక్తులు ఆందోళన చెందుతున్నారు.

మెతకు వెళ్లి తిరిగి రాని పందులు :ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దేవాలయం దిగువున ఉన్న ప్రాంతంలో పందుల పెంపకం చేస్తుంటారు. ఇవన్ని మునేరు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. స్థానికంగా ఉన్న గార్డెన్‌లలో భక్తులు ఫంక్షన్‌లు చేసుకున్నపుడు మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకొచ్చి పందులకు మేతగా పెట్టి పెంచుతున్నారు. మేతకు వెళ్లిన పందులు తిరిగి రాకపోవడంతో వాటిని వెతుక్కుంటూ పెంపకదారులు బయలుదేరారు. కదలలేని పందలను చూసి వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా గత 15 రోజులుగా మేతకు వెళ్లిన పందులు ఎక్కడబడితే అక్కడే కుప్పకూలి దర్శనమిస్తున్నాయి వారికి. పెంపకం దారులు అవి ఎక్కడ ఉన్నాయో వెతికి భూమిలో పాతిపెడుతున్నారు. వారికి కనిపించని కళేబరాలు అలాగే కుళ్లిపోతున్నాయి. మూడు దశాబ్దాలుగా పందుల పెంపకం చేస్తున్నామని ఎపుడు ఇలాంటి ఘటనలు ఎదురు కాలేదని బాధితులు తెలిపారు.

వ్యాధిని గుర్తించలేకపోతున్న వైద్యులు : ఇప్పటికే సుమారు వెయ్యి పందులు చనిపోయి ఒక్కొక్కరికి లక్షల్లో నష్టం జరిగిందని వాపోతున్నాురు. స్థానికంగా ఉన్న పశు వైద్యులకు చూపించినా మార్పు రాలేదని పేర్కొన్నారు. తమకు పందులే జీవనాధారం పెంపకందారులు చెపుతున్నారు. అధికారులు పట్టించుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు వారాల క్రితం ఆస్పత్రికి వచ్చి చనిపోతున్న పందుల గురించి చెప్పగానే కొన్ని రకాల మందులు ఇచ్చామని పశు వైద్యుడు అనిల్ తెలిపారు. చనిపోయిన కళేబరంలో నమునాలు తీసేందుకు ప్రయత్నించామని, కానీ పంది చనిపోయిన మూడు, నాలుగు రోజుల తర్వాత తెలియటంతో ఏం చేయలేకపోయామని అనిల్ అన్నారు. పందులు ఎక్కువగా జన సంచారం ఉన్న ప్రాంతాల్లోనే తిరుగుతూ, అధికంగా అక్కడే చనిపోతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం మునేరులో తిరుపతమ్మ తిరునాళ్ల జరుగుతున్న ప్రదేశంలోనే పదుల సంఖ్యలో పందుల కళేబరాలు కుళ్లిపోయి ఉన్నాయని, పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఇప్పటికే పంచాయతీ అధికారులు స్పందించి గత వారం రోజుల్లో వెయ్యి పంది కళేబరాలను జేసీబీ సాహాయంతో పూడ్చి పెట్టారు. కళేబరాలను పూడ్చిపెట్టే పనులను ప్రతి రోజు చేస్తున్నట్లు సర్పంచి వేల్పుల పద్మ కుమారి తెలిపారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details