pidikedu atma gouravam kosam Poster: రాష్ట్రంలో వైసీపీ పాలనలో బహుజనులపై జరుగుతున్న అరాచకాలపై పిడికెడు ఆత్మగౌరవం కోసం పేరుతో ఉద్యమాన్ని చేపట్టనున్నామని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అన్నారు. విజయవాడలో పిడికెడు ఆత్మగౌరవం కోసం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. మరో 16 నెలల్లో యుద్ధం జరగబోతుంది అని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చెబుతున్నారన్నారు. బహుజనులంతా ఐకమత్యంగా ఉండి జరుగుతున్నా అన్యాయంపై 2024 ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. వైకాపా ప్రభుత్వం అమరావతి నిలిపివేయడం వలన బహుజనులే ఎక్కువగా నష్టపోయారన్నారు. పోలవరం వలన గిరిజనులు, పరిశ్రమలు తరలిపోవడం వలన నిరుద్యోగులు.. బడుగు బలహీన వర్గాలే నష్టపోయాయన్నారు. ఆత్మా గౌరవం కోసం కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నీరన దీక్షలు చేపడతామని పోతుల బాలకోటయ్య వెల్లడించారు.
పిడికెడు ఆత్మగౌరవం కోసం.. పోస్టర్ విడుదల... - pidikedu athma gouravam kosam in AP
pidikedu atma gouravam kosam in AP: వైసీపీ ప్రభుత్వంలో బడుగుబలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతు బాలకోటయ్య అన్నారు. త్వరలో చేపట్టబోయే పిడికెడు ఆత్మగౌరవం కోసం ఉద్యమం పోస్టర్ను విడుదల చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని బాలకోటయ్య ఆరోపించారు. ఆత్మా గౌరవం కోసం కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నీరన దీక్షలు చేపడతామని తెలిపారు.
![పిడికెడు ఆత్మగౌరవం కోసం.. పోస్టర్ విడుదల... pidikedu athma gouravam kosam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17205995-252-17205995-1671023594511.jpg)
pidikedu athma gouravam kosam
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య