Pawankalyan Meet CBN: తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో దాదాపు ఇరువురి మధ్య రెండున్నర గంటలపాటు సమావేశం సాగింది. ఇద్దరి మధ్య జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నంబర్-1పైనా సంభాషణ జరిగింది. దీంతో పాటు ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనలపైనా మాట్లాడుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై వీరిద్దరూ చర్చించారు.
అంతకుముందు తెదేపా అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కి ఎదురెళ్లి గుమ్మం వద్ద చంద్రబాబు స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని ఇప్పటికే నిర్ణయించిన నేతలు.. కొద్దినెలల క్రితం విజయవాడలోని ఓ హోటల్‌లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-1పైనా తాజా భేటీలో చర్చించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు, పవన్ తాజా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
ఇవీ చదవండి: