ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళ జడ్జీపైనే మందుబాబుల వీరంగమా..! మహిళ భద్రత అంటే ఇదేనా..! : పంచుమర్తి అనురాధ - టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ

Panchumurti Anuradha : మహిళ జడ్జీ పట్ల మందుబాబులు వీరంగం సృష్టించారంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. మహిళల పట్ల నేరాలు పెరిగాయని కేంద్రం ఇచ్చిన నివేదికకు ముఖ్యమంత్రి ఏం సమాధానం ఇస్తారని అన్నారు.

Panchumurthi Anuradha
పంచుమర్తి అనురాధ

By

Published : Dec 27, 2022, 7:32 PM IST

Panchumurti Anuradha : మహిళా జడ్జిని వేధించే స్థాయికి ఏపీలో భద్రత దిగజారడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మంత్రి బుగ్గన ఇలాఖా డోన్​లో మహిళా జడ్జిపై మందుబాబులు వీరంగం సృష్టించారంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నట్టు అని ఆమె ప్రశ్నించారు. జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తికే రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి.. సామాన్య మహిళలకు ఏం భద్రత కల్పిస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళల పట్ల నేరాలు పెరిగాయని లోక్ సభలో హోం శాఖ ఇచ్చిన నివేదికపై.. జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టు ధిక్కరణ కేసులు, రైతు ఆత్మహత్యలు, మహిళలపై నేరాలు, దళిత, గిరిజనులపై దాడుల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసిన హీన చరిత్ర జగన్ రెడ్డిదేనని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details