ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం ఆదుకోకుంటే వ్యవసాయం మానేయాల్సిందే - బతకడం కూడా కష్టమే : ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు - రాష్ట్రంలో ఏటికేడు తగ్గుతున్న వరి సాగు

Paddy Crop Dry Due to Lack of Irrigation Water: రైతు కళ్లలో కన్నీరు తప్ప.. పొలాల్లో నీరు కనిపిచడం లేదు. కంటి రెప్పలా కాచుకున్న పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు వర్షాభావం మరోవైపు సాగర్‌ జలాలు లేక ఈ ఏడాది ఎన్టీఆర్ జిల్లాలోని రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరై పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇంతలా నష్టపోతున్నా ప్రభుత్వం తమ వైపు కన్నెత్తయినా చూడట్లేదని వాపోతున్నారు.

Crop_Dry_Due_to_Lack_of_Irrigation_Water
Crop_Dry_Due_to_Lack_of_Irrigation_Water

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 2:50 PM IST

ప్రభుత్వం ఆదుకోకుంటే వ్యవసాయం మానేయాల్సిందే - బతకడం కూడా కష్టమే : ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

Paddy Crop Dry Due to Lack of Irrigation Water :ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఆయుకట్టు వర్షాధారమే. చెరువుల కింద కొంత నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద మరికొంత ఆయుకట్టు ఉంది. ఈ ఏడాది నాగార్జున సాగర్ కింద సాగునీరు విడుదల చేయలేదు. పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాకు వ్చినా మధిర, నూజివీడు జోన్లకు సాగునీరు రాలేదు. తిరువూరు ప్రాంతానికి కూడా అందలేదు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల పంట దెబ్బతింది. ఈ ఆయుకట్టు స్థిరీకరణకు తెలుగుదేశం పార్టీ హయాంలో చేపట్టిన చింతలపూడిఎత్తిపోతల పథకాన్ని (Chintalapudi Lift Irrigation Scheme) వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని మధ్యలోనే వదిలేశారు. మునేరుపై ఆనకట్ట ఆధునీకరణకు నోచుకోలేదు.

YSRCP Government not Completed Chintalapudi Lift Irrigation Scheme : ఎన్టీఆర్ జిల్లాలో పలు ఎత్తిపోతల పథకాలు వట్టిపోయాయి. వర్షాభావం, సాగర్ జలాలు విడుదల కాక చెరువులు వెలవెలపోయాయి. ఈ నేపథ్యంలో సకాలంలో నీరందక పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా నీటి ఆధారమైన వరి పొలాలు నెర్రెలు విచ్చుకున్నాయి. గింజ పాలు పోసుకునే కీలక సమయంలో పంటకు సాగునీరు కరవైంది.

సాగునీరందక రైతుల అవస్థలు - వరి పొలాలకు బీటలు, పొట్టదశలోనే ఎండిపోతున్న పైరు

NTR District Paddy Farmers Problems :జిల్లాలో సాధారణ వర్షపాతం 732 మిల్లీమీటర్లు కాగా 614 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సుమారుగా 1 6మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం పడింది. మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో కరవు ఛాయలు రాజ్యమేలుతున్నాయి. ఎటొచ్చి ప్రభుత్వం గంపలగూడెం, తిరువూరు రెండు మండలాలనే అదీ పాక్షిక కరవు మండలాలుగా ప్రకటించింది. అంతకంటే తక్కువ వర్షపాతం కురిసిన మండలాలను వ్యవసాయ అధికారులు విస్మరించారు.

పశువులకు మేతగా వరి పైరు :వరి పంట పొట్టదశలో దెబ్బతినడంతో గింజకట్టక చాలా గ్రామాల్లో పైరును పశువులకు మేతగా వేస్తున్నారు. ఎకరానికి 20వేల నుంచి 25 వేల వరకు ఖర్చు చేశామని ఇలా జరుగుతుందని భావించలేదని రైతులు నిట్టూరుస్తున్నారు. సాగర్ జలాలు ఇప్పుడిచ్చినా ఫలితం లేదని వాపోతున్నారు.

రాష్ట్రంలో ఏటికేడు తగ్గుతున్న వరి సాగు - కృష్ణా డెల్టాలో, ఉత్తరాంధ్రలో ఎండుతున్న పంటలు

YSRCP Government careless on Farmers Troubles :సాగునీరు సకాలంలో అందక వరిపైరు దెబ్బతినగా కాపాడుకునేందుకు ఇప్పటికీ కొందరు రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చెరువుల్లో అడుగంటిన నీటిని వ్యయ, ప్రయాసలకోర్చి మోటార్ పంపుల ద్వారా రైతులు తోడుకుంటున్నారు. గంటకు మూడు లీటర్ల డీజిల్ వేసి నీటిని పంటకు అందించేందుకు ఆఖరి ప్రయత్నం చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. వ్యవసాయానికి రాత్రి పూట విద్యుత్ ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయం మానేయాల్సిందే.. లేదంటే బతకడం కష్టం :"వరి సాగుకు చాలా పెట్టుబడులు పెట్టాం. వరి పైరు ఎండిపోతుంది. వర్షం కురిసిన, సాగర్ నీరు అందించిన మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఈ సమయంలో సాగర్ నీరు అందించినా పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. మేము తినడానికి కూడా బయట నుంచి తెచ్చుకోవాలి. ప్రభుత్వం ఆదుకుంటే తరువాత పంటలు సాగు చేయడానికి అవకాశం ఉంది. లేదంటే వ్యవసాయం మానేయాల్సిందే."- వరి రైతులు

Irrigated or Dry Paddy Crops in Murukondapadu: సాగునీరు లేక ఎండిపోతున్న వరి పంట.. ఉరితాళ్లతో రైతుల నిరసన

ABOUT THE AUTHOR

...view details