ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్గానిక్ పద్ధతిలో బంతిపూలు సాగుతో లాభాలు అర్జిస్తున్న రైతు - Marigolds cultivation in organic method

Organic Farming With Marigolds: ఆశించిన లాభాలు రాకపోతే రైతులు దిగాలు పడతారు. కొందరు ఆత్మహత్యలకు సైతం వెనకాడరు. ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఆ రైతు మాత్రం... ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో రెండేళ్లుగా బంతి తోట సాగుచేస్తూ అధిక లాభాలు పొందుతున్న రైతుపై ప్రత్యేక కథనం.

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 18, 2022, 9:06 PM IST

Organic Farming With Marigolds: ఓ రైతు గతంలో పత్తి, మిరప పంటలు సాగు చేసి ఆశించిన లాభాలు రాక, ప్రస్తుతం బంతిపూలు సాగు చేసి మంచి లాభాలు సంపాధిస్తున్నాడు. సంవత్సరానికి మూడు పంటలు పండించి జిల్లాలో వివిధ ప్రాంతాల మార్కెట్లకు బంతిపూలు ఎగుమతి చేస్తున్నాడు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రోజు పదుల సంఖ్యలో తన వద్దకు వచ్చి వారికి కావాల్సిన పువ్వులు కొనుక్కొని వెళతారని రైతు శంకరరావు చెబుతున్నాడు. గత రెండు సంవత్సరాలుగా సాగు చేస్తూ ఆశించిన లాభాలు సంపాదిస్తున్నానంటున్నాడు.

ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన శంకరరావు అనే రైతు గతంలో పత్తి, మిరప పంటలు సాగు చేసేవాడు. ఆశించిన లాభాలు రాక ప్రత్యమ్నాయ పంటల వైపు ఆలోచించాడు. అప్పుడే ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. చుట్టు పక్కల గ్రామాలు ప్రజలకు నిత్యమూ అవసరమైన బంతిపూల సాగు కోసం ఆలోచన చేశారు. వెంటనే ఆ పంటకు కావల్సిన విత్తనాలు, సాగు విధానం తెలుసుకున్నాడు. బంతిపూల సాగు ప్రారంభించారు. ప్రస్తుతం ఆశించిన లాభాలు సంపాదిస్తున్నాడు. నిత్యమూ వివిధ పూజలకు ప్రజలు శంకరరావు వద్దకు వచ్చి వారికి అవసరమైన పూలు కొనుక్కుంటున్నారు. ఎకరన్నార భూమిలో సంవత్సరానికి మూడు సార్లు బంతిపంట సాగు చేస్తున్నాడు ఈ రైతు. నిత్యమూ తన మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు వచ్చి వారికి కావలసిన రకం బంతిపూలు కొనుక్కొని వెళ్తున్నారని రైతు శంకరరావు చెబుతున్నారు.


పొలం దున్ని, విత్తనాలు చల్లిన 45 రోజుల తర్వాత పంట చేతికొస్తుందని శంకరరావు చెబుతున్నారు. ఎకరానికి లక్ష రూపాయల పెట్టుబడి అవుతుందని, పూత ప్రారంభమైన తర్వాత రెండు నెలల పాటు దిగుబడి వస్తుందంటున్నాడు..... రోజుకి మూడు క్వింటాల బంతి పూలు దిగుబడి వస్తుందని శంకరరావు తెలిపారు. భవిష్యత్తులో బంతితో పాటు చామంతి, గులాబి పూలు సాగుచేస్తానని శంకరరావు అంటున్నారు. తన పంటకి కేవలం ఆర్గానిక్ మందులు మాత్రమే వాడుతానని, అందుకే భూమి సారం తగ్గకుండా ఉంటుందంటున్నారు. భూమి సారవంతంగా ఉంటేనే పువ్వుల సైజు తగ్గకుండా ఉంటుందన్నారు. శంకరరావు తాను ఉపాధి పొందడమే కాకుండా మరో ఐదుగురికి పని కల్పిస్తున్నాడు. ఇతర వ్యవసాయ భూముల్లో పన చేసే కూలీలకు ఉపాధి సీజన్ బట్టి ఉంటుంది. రైతు శంకరరావు వద్ద పని చేసే వారికి సంవత్సర పొడవునా పని ఉంటుంది.

ఆదర్శ రైతు... ఆర్గానిక్ పద్ధతిలో బంతిపూలు సాగు చేస్తూ లాభాలు అర్జిస్తున్న రైతు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details