Porous Chemical Factory Fire Accident News: పోరస్ కెమికల్స్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరొకరు మృతిచెందాడు. పోరస్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో గాయాలైన 11 మంది బాధితులకు విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో బీహార్‌కు చెందిన మునవర్ దాస్ అనే వ్యక్తి ఇవాళ మృతిచెందాడు. దీంతో ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఆస్పత్రిలో ప్రస్తుతం పదిమంది చికిత్స పొందుతుండగా.. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పోరస్ కెమికల్స్ ప్రమాదంలో మరొకరు మృతి.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య - పోరస్ కెమికల్స్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య
Deaths in Porous Chemical Factory Fire Accident: పోరస్ కెమికల్స్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరొకరు మృతిచెందారు. దీంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఆస్పత్రిలో ప్రస్తుతం 10 మంది చికిత్స పొందుతున్నారు.
Porous Chemical Factory Fire Accident