ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CP Kanti Rana on Murder Issue: ఆ హత్యకు గంజాయితో సంబంధం లేదు: సీపీ - 520కిలోల గంజాయి పట్టివేత

NTR district CP Kantirana press meet : రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తున్నామని విజయవాడ సీపీ కాంతి రాణా తెలిపారు. సంవత్సరం వ్యవధిలో 84 కేసులు నమోదు చేసి 251మందిని అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు. అజయ్ సాయి అనే యువకుడిపై దాడికి గంజాయి మత్తు కారణం కాదని స్పష్టం చేశారు. హత్య జరిగిన సమయంలో నిందితులు గంజాయి సేకరించలేదని సీపీ తెలిపారు.

విజయవాడ సీపీ కాంతి రాణా
విజయవాడ సీపీ కాంతి రాణా

By

Published : May 9, 2023, 8:26 PM IST

NTR district CP Kantirana press meet : ఇయర్ బడ్స్ విషయంలోనే అజయ్ సాయి అనే యువకుడి హత్య జరిగిందని ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతిరాణా తెలిపారు. అజయ్ తన స్నేహితులతో కలిసి మాట్లాడే సమయంలో.. ఇయర్ బడ్స్ కనబడటం లేదని స్నేహితుడు తెలిపాడు. అజయ్ తీశాడని అనుమానంతో అతన్ని నిలదీశారు. తాను తీయలేదని చెప్పటంతో అజయ్ పై మూకుమ్మడిగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అజయ్​ను ఓ ఆసుపత్రిలో చేర్చి.. కంకిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని చికిత్స చేయించారు. తీవ్రంగా గాయపడిన అజయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో జరిగిన గాయాలు కాదని.. శరీరంపై కొట్టడం వల్ల జరిగిన గాయాలని పోలీసులకు వైద్యులు తెలిపారు. దీంతో అజయ్​ని ఆస్పత్రిలో చేర్చిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాము అజయ్​ను కొట్టామని చెప్పడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. నిందితులపై గతంలో కేసులున్నాయని వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. హత్య జరిగిన సమయంలో నిందితులు గంజాయి సేవించలేదని సీపీ తెలిపారు.

గంజాయి మత్తులో మర్డర్ జరిగినట్లుగా జరుగుతున్న ప్రచారం సరికాదు. దీనివల్ల సిటీ ప్రతిష్ట దెబ్బతింటోంది. గంజాయి నియంత్రణకు పోలీస్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ ఏడాది 84 కేసులు నమోదు చేసి 254 మందిని అరెస్టు చేశాం. 251కిలోల గంజాయి సీజ్ చేశాం. నలుగురిపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపించాం. మరో ఏడుగురిని నగరం నుంచి బహిష్కరించాం. - కాంతిరాణా, ఎన్టీఆర్ జిల్లా సీపీ

రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత..విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర పోలీసు చెక్ పోస్ట్ వద్ద 520కిలోల గంజాయిని పట్టుకున్నామని సీఐ సింహాద్రినాయుడు తెలిపారు. సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అరకు వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ వాహనంలో సరుకు పట్టుబడిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. వాహనాన్ని పోలీసులు అపగా.. అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకుని వాహనం లో 520కిలోల గంజాయిని పట్టుకున్నామని వివరించారు.

నిందితుల్లో ఒడిశా రాష్ట్రం మల్కన్​గిరి జిల్లా కైరాపుట్​కు చెందిన కృష్ణ, అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచుంగుపుట్ సమీప కులబేరు గ్రామానికి చెందిన కణికుడు సోనాదర్ ఉన్నట్లు వెల్లడించారు. వ్యానును ఎస్.కోట చేరిస్తే రూ.5వేలు ఇస్తామని వీరికి ఒక వ్యక్తి చెప్పడంతో వచ్చారని తెలిపారు. గంజాయిని రూ.15వేలుకి కొనుగోలు చేశారన్నారు. మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడని, గంజాయిని, వాహనాన్నీ సీజ్ చేశామని చెప్పారు. ఈ గంజాయి విలువ బహిరంగ మార్కెట్​లో రూ. కోటి ఉంటుందని వెల్లడించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details